ప్రొఫెసర్లకు నోటీసులా... సిగ్గుచేటు

2 Oct, 2015 15:00 IST|Sakshi
ప్రొఫెసర్లకు నోటీసులా... సిగ్గుచేటు

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం అనంతపురంలోఆయన మాట్లాడుతూ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రత్యేక హోదా ఉద్యమానికి  చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

విదేశీ యాత్రలు మాని ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని చంద్రబాబుకు ఈ సందర్భంగా విశ్వేశ్వర్రెడ్డి సూచించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం విశాఖలో యువభేరీ కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో ఆంధ్ర యూనివర్శిటీ ప్రొఫెసర్లకు చంద్రబాబు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటని వై. విశ్వేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు.

సెప్టెంబర్ 22వ తేదీన విశాఖపట్నంలోని కళావాణి పోర్టు స్టేడియంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన యువభేరీ సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో ప్రొఫెసర్ ప్రసాదరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.  యూనివర్శిటీ విద్యార్థులను స్థానిక ప్రొఫెసర్లు బలవంతంగా పంపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సదరు ప్రొఫెసర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వై.విశ్వేశ్వర్రెడ్డి పై విధంగా స్పందించారు.  

>
మరిన్ని వార్తలు