ముఖ్యమంత్రి వద్దే హోం, ఆర్థిక శాఖలు!

22 Mar, 2017 18:15 IST|Sakshi
ముఖ్యమంత్రి వద్దే హోం, ఆర్థిక శాఖలు!

శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని విమర్శలు వస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనవద్దే ఉంచుకున్నారు. మొత్తం 44 మందితో కూడిన మంత్రివర్గాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రులు ఇద్దరికీ కూడా కీలకమైన శాఖలే ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు ప్రజా పనుల శాఖ, మరో డిప్యూటీ సీఎం దినేష్ శర్మకు పార్లమెంటరీ వ్యవహారాలు, ఉన్నత విద్యాశాఖలు ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో దాదాపు 24 ఏళ్ల పాటు ఉండి, ఎన్నికలకు కొంతకాలం ముందే బీజేపీలోకి వచ్చిన రీటా బహుగుణ జోషి, మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు సిద్దార్థ నాథ్ సింగ్ లాంటి పెద్దవాళ్లకు కూడా మంత్రిపదవులు లభించాయి.

ఇప్పటివరకు తెలిసిన శాఖలు

యోగి ఆదిత్యనాథ్: ముఖ్యమంత్రి, హోం శాఖ, ఆర్థిక శాఖ
కేశవ్ ప్రసాద్ మౌర్య: ప్రజాపనుల శాఖ
దినేష్ శర్మ: పార్లమెంటరీ వ్యవహారాలు, ఉన్నత విద్య
చేతన్ చౌహాన్: క్రీడా శాఖ
అశుతోష్ టాండన్: ప్రాథమిక విద్యాశాఖ
రీటా బహుగుణ జోషి: సెకండరీ విద్యాశాఖ
మొహసిన్ రజా: మైనారిటీ వ్యవహారాలు
స్వామి ప్రసాద్ మౌర్య: వ్యవసాయ శాఖ

>
మరిన్ని వార్తలు