వైఎస్‌ఆర్‌ పాదయాత్ర స్ఫూర్తిదాయకం: వైఎస్‌ జగన్‌

9 Apr, 2017 20:35 IST|Sakshi
వైఎస్‌ఆర్‌ పాదయాత్ర స్ఫూర్తిదాయకం: వైఎస్‌ జగన్‌

హైదరాబాద్‌: ప్రజల కోసం, ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సరిగ్గా 14 ఏళ్ల కిందట దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన మహాత్తరమైన పాదయాత్ర స్ఫూర్తిని ఆయన తనయుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రజల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్న ఆయన ప్రజాప్రస్థాన పాదయాత్ర ఎల్లప్పుడూ గుర్తు ఉంటుందని, ఎల్లవేళలా స్ఫూర్తిని పంచుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

’14 ఏళ్ల కిందట మండే ఎండలో ఆయన తన ప్రజల కోసం గొప్ప పాదయాత్రను చేపట్టారు. ప్రజల ప్రేమాభిమానాల్ని పొందారు. ఆయన పాదయాత్ర ఎల్లప్పుడూ గుర్తుంటుంది. ఆయన ఎల్లవేళలా స్ఫూర్తి పంచుతూనే ఉంటారు’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు