పుణ్యక్షేత్రాల్లో పెరిగిన భక్తుల రద్దీ

25 Dec, 2017 08:50 IST|Sakshi

యాదాద్రి/వేములవాడ: వరుస సెలవులు రావడంతో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదాద్రి, వేములవాడల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలపైగా సమయం పడుతున్నది. కొండపైన తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడంతో భక్తుల వాహనాలను తులసి కాటేజ్‌ వద్ద నిలిపివేశారు.
వేములవాడలో...
వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. దీంతో సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతున్నది. భక్తుల రద్దీతో  ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో శీఘ్ర దర్శనాన్ని అధికారులు అమలు చేశారు. 

మరిన్ని వార్తలు