Roopkund Mysterious Lake: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్‌ వెనుక అసలు కారణం ఏమిటీ?

26 Nov, 2021 11:18 IST|Sakshi

పుణ్య క్షేత్రాలకు, పురాతన దేవాలయాలకు మన దేశం పెట్టిందిపేరు. ఐతే మన దేశ అగ్రభాగంలో ఉన్న ఓ నది మాత్రం పుణ్యక్షేత్రం కానప్పటికీ దానిని చూసేందుకు వేలల్లో జనాలు వెళ్తుంటారు. కాకపోతే ఆ నదిలో నీళ్లతోపాటు, పైన తేలే అస్థిపంజరాలు కూడా ఉంటాయి. దీని వెనుక దాగి ఉన్న మిస్టరీ ఎంటో తెలుసుకుందాం..

ఏడాదంతా మంచులోనే.. అదికరిగిందంటే మాత్రం..
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోనే ఉందీ నది. రూప్‌ఖండ్‌ నది అని దీనికి పేరు. ఇది సముద్ర మట్టానికి 5029 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏడాదిలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుందీ నది. కానీ మంచు కరిగిపోగానే అక్కడి వాతావరణం అంతా కూడా భయానకంగా మారిపోతుంది. వందలాది అస్థిపంజరాలతో చూసేందుకు అత్యంత భీభత్సంగా ఉంటుంది. ఈ అస్థిపంజరాలను మొదటిసారిగా 1942లో బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్ గుర్తించారు. ఐతే ఎన్నో యేళ్లుగా ఈ అస్థిపంజరాల వెనుక ఉన్న మిస్టరీని చేధించేందుకు ప్రయత్నాలు సాగాయి. ఎవరెవరేం చేప్పారంటే..

జనరల్ జోరావర్ సింగ్ సైన్యమేనా..
ఈ అస్థిపంజరాలు కాశ్మీర్‌కు చెందిన జనరల్ జోరావర్ సింగ్ సైన్యానికి సంబంధించినవని అక్కడి స్థానికులు నమ్ముతారు. 1841లో టిబెట్ యుద్ధం నుండి తిరిగి వస్తుండగా, మంచు తుఫానులో చిక్కుకుని హిమాలయ ప్రాంతం మధ్యలో తప్పిపోయి మరణించారనే కథనం ప్రచారంలో ఉంది.

చదవండి: Interesting Facts About Death: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం..

మంచు తుఫానే కారణమా..
కనౌజ్ రాజా జస్ధావల్, అతని భార్య బలంప, అతని సేవకులు, నృత్య బృందంతో కలిసి నందా దేవి దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు పెద్ద మంచు తుఫాను కారణంగా పూర్తి సమూహం మరణించి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది.

వాస్తవం ఏమిటీ?
ఐతే 2014 శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ఫ్రోజెన్‌ లేక్‌లో ఉన్న మొత్తం 200 అస్థిపంజరాలు 9వ శతాబ్ధానికి చెందినవ భారత తెగకు చెందినవని, భారీ వడగండ్లవానలో వీరంతా మరణించారని తేల్చింది. దీనితో దీనివెనుక దాగిన మిస్టరీ వీడింది.

పాపం.. అంత పెద్ద వడగండ్లు తగిలి..
మృతుల తల వెనుక భాగంలో బలమైన దెబ్బ తగలడం మూలంగా వీరంతా మరణించారని, బహుశా క్రికెట్ బాల్ సైజు వడగళ్ళు కురిసి ఉండవచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఐతే వారి శరీర ఇతర భాగాలపై ఎటువంటి గాయాలు కనుబడలేదట. దీంతో ఎటువంటి యుద్ధం గానీ, ఆయుధాల ప్రమేయంగానీ లేకుండా జరిగిన ప్రమాదమని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.

ప్రతీయేట ఈ మిస్టీరియస్‌ రూప్‌ఖండ్‌ నదిని చూసేందుకు వేలాదిమంది పర్యాటకులు, సాహసికులు వస్తుంటారు. ఈ సరస్సు చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, చూపరులకు అందమైన అనుభూతిని కలిగించినప్పటికీ, నదిలో తేలుతున్న అస్థిపంజరాల భయంకరమైన దృశ్యాన్ని చూసినప్పుడు మాత్రం వారి వెన్నులో వణుకు ప్రారంభమౌతుంది..!!

చదవండి: Coffee and Alzheimer's Disease: మతిమరుపుతో బాధపడుతున్నారా? కాఫీతో మీ బ్రెయిన్‌కు పదును పెట్టండి..

మరిన్ని వార్తలు