నా కూతురే పెద్ద దిక్కనుకున్నా... ఇంతలోనే..!

2 Aug, 2022 09:49 IST|Sakshi

కష్టాలు,కన్నీళ్లతో జీవితాన్ని అతి జాగ్రత్తగా నెట్టుకొస్తున్న కుటుంబానికి వరుసగా దెబ్బ మీద దెబ్బ కోలుకోలేని మరో దెబ్బ పడితే! కష్టసమయంలో  ఫ్యామిలీగా అండగా ఉన్నవారే ఉన్నట్టుండి ప్రమాదంలో పడితే! ఆ ఇంట్లోని వాళ్లు అనుభవించే బాధ ఊహించడానికే కష్టం. లలిత మనీషా కష్టం అలాంటిదే! జీవన‍్మరణ పోరాట చేస్తున్న కన్న కూతురిని కాపాడుకునేందుకు అష్టకష్టాలుపడుతూ..దాతలు స్పందించాలని వేడుకుంటున్న కన్నతల్లి గాథ ఇది!!

2008లో లలితషా  భర్త బ్రెయిన్ హేమరేజ్‌తో చనిపోయారు. ఆర్థిక సంక్షోభానికి తోడు, చిన్నపిల్లలతో  కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొస్తోంది.  ఈ క్రమంలో పెద్ద కుమార్తె ఏళ్ల  మనీషా(22) ఎంతో కష్టపడి పీజీ పూర్తి చేసి ఉద్యోగాన్ని సంపాదించుకుంది. కుటుంబం బాధ్యతలను తన భుజాలపై వేసుకుంది. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుని, అనేక కష్టాలుపడిన తనకు అంతకంటే చిన్నవయసులోనే పెద్దకుమార్తె చేతికి అందిరావడంతో పొంగిపోయింది.  కానీ ఆ ఆనందం ఆమెకు ఎంతోకాలం నిలవలేదు

ఈ ఏడాదిలో కొద్దిగా తలనొప్పి అనిపించింది మనీషాకు. పెద్దగా పట్టించుకోలేదు యథావిధిగాగా డ్యూటీకి వెళ్లిపోయింది.  తర్వాత అదికాస్తా మరింత తీవ్రమై గత ఏప్రిల్‌లో స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించారు.  ఆమెకు మెదడులో రక్తస్రావమై, గడ్డ కట్టినట్లు పరీక్షల్లో తేలింది.

వైద్యులు ఎంఆర్‌ఐ, రక్తపరీక్షలు, సీటీ స్కాన్‌లు నిర్వహించి మనీషాకు మెదడుకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. తక్షణమే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో పక్షవాతానికి గురైన మనీషా మాట్లాడలేని, చూడలేని దీనస్థితికి చేరుకుంది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతోపాటు, నీరు కూడా చేరడంతో తలంతా ఉబ్బిపోయింది. చివరికి, మనీషా బతకాలంటే న్యూరో సర్జరీ అవసరమని వైద్యులు  తేల్చేశారు. దీనికయ్యే ఖర్చు రూ. 7,41,200 ($ 9291.25)గా అంచనా  వేశారు.

అయితే మనీషా వైద్యం కోసం నగలు అమ్మేశారు లలిత షా. దొరికిన చోటల్లా శక్తికిమించి అప్పు చేసి ఇప్పటికే రూ. 10లక్షలు దాకా  ఖర్చు చేశారు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన లలిత కుటుంబానికి  ఇక వైద్య ఖర్చులు భరించే  శక్తి లేదు. అందుకే దాతలే కరుణించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

"ప్రతి సెకనుకి నా బిడ్డ పరిస్థితి క్షీణిస్తోంది. సరిగ్గా చూడలేక నోరారా మాటకు నోచుకోకుండా పడివున్న నా కుమార్తెను చూస్తోంటే గుండె తరుక్కుపోతోంది. దయచేసిన నా పరిస్థితిని అర్థం చేసుకుని విరళాలివ్వండి! నా కుమార్తెను కాపాడండి’’ అంటూ కన్నీళ్లతో వేడుకుంటోంది. దయచేసి సాయం చేయండి,మనీషాకు ప్రాణభిక్ష పెట్టండి!  అని ప్రార్థిస్తోంది. (అడ్వర్టోరియల్‌

మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు