Sakshi News home page

గొంతు, నోటి క్యాన్సర్‌లను గుర్తించే ఏఐ ఆధారిత పరికరం! లాలాజలంతోనే..

Published Fri, Nov 24 2023 1:43 PM

AI Based Screening Test Detect Oral And Throat Cancers From Saliva  - Sakshi

క్యాన్సర్‌లలో కొన్నింటిని చాలావరకు ముందుగానే తెలుసుకుని,  కొద్దిపాటి శస్త్ర చికిత్సలతో బయటపడొచ్చు. కానీ గొంతు, నోటి క్యాన్సర్‌ల విషయంలో అలా కాదు. చాలా వరకు చివరి స్టేజ్‌లోనే గుర్తించగలం. ముందుగా గుర్తించడం అసాధ్యం. అలాంటి ప్రాణాంతక క్యాన్సర్లని ముందుగా గుర్తించి ట్రీట్‌మెంట్‌ తీసుకునేలా ఏఐ ఆధారిత సరికొత్త సాధనాన్ని ఆవిష్కరించారు పరిశోధకులు. ఏ వ్యాధి అయినా నయం చేయడం కంటే రాకుండా నివారించడం అనేది ఉత్తమం. కాబట్టి ఆ రకమైన క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉందా? అన్నది ఈ అత్యాధునిక సాధనంతో ముందుగా గుర్తిస్తే..వెంటనే ఆ వ్యాదులకు బ్రేక్‌ వేసి ఎన్నో ప్రాణాలు నిలబెట్టగలుగుతాం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏంటా సరికొత్త సాధనం? ఎలా క్యాన్సర్‌ని డిటెక్ట్‌ చేస్తుంది? కచ్చితమైన ఫలితాలే ఇస్తుందా..? తదితరాల గురించే ఈ కథనం.

నోరు, గొంతు క్యాన్సర్‌లను ముందుగా గుర్తించే అత్యాధుని పరకరాలు లేకపోవడంతో ఆ క్యాన్సర్‌లను లాస్ట్‌ స్టేజ్‌లోనే గుర్తించడం జరగుతోంది. ఈ సమస్యకు చెక్‌పెట్టే సోలెడాడ్‌ సోసా, జూలియా, అగ్యిర్రే ఘిసో తదితర పరిశోధక బృందం కంప్యూటర్‌ ఆధారిత పరికరాన్ని ఆవిష్కరించారు. ఇది 90% కచ్చిత ఫలితాలను ఇవ్వగలదని వెల్లడించారు. ఈ బృందం గొంతు, నోటి క్యాన్సర్‌లను ఫస్ట్‌ స్టేజ్‌లోనే ఎలా నివారించాలనే దిశగా గతంలో పలు పరిశోధనలు చేసింది. ఆ అధ్యయనంలో నిద్రాణంగా ఉన్న క్యాన్సర్‌ కణాల సామర్థ్యాన్ని ఎన్‌ఆర్‌2ఎఫ్‌1(NR2F1) ప్రోటీన్‌తో నియంత్రించొచ్చని కనుగొన్నారు. 

ప్రోటీన్‌ ఎలా నియంత్రిస్తుందంటే..
ఈ గ్రాహక ప్రోటీన్ సెల్ న్యూక్లియస్‌లోకి ప్రవేశించి, క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధించే ప్రోగ్రామ్‌ను సక్రియం  చేసేందుకు అనేక జన్యువులను ఆన్ లేదా ఆఫ్ చేస్తుంది. ప్రాథమిక కణుతుల్లో ఎన్‌ఆర్‌2ఎఫ్‌1 స్థాయిలు తక్కువుగా ఉంటాయి. దీంతో నిద్రాణంగానే క్యాన్సర్‌ కణాలు వ్యాప్తి చెందడం మొదలు పెడతాయి. దీంతో ఎన్‌ఆర్‌2ఎఫ్‌1 ప్రోటీన్‌ స్థాయిలు తగ్గడం జరుగుతుంది. అందువల్ల ఈ ఎన్‌ఆర్‌2ఎఫ్‌1 ప్రోటీన్‌ సాయంతో నిద్రాణంగా ఉన్న ఈ క్యాన్సర్‌ కణాలను ప్రేరేపించేలా సంక్రియం చేస్తే సులభంగా క్యాన్సర్‌ కణాలను నియంత్రించొచ్చని వెల్లడించారు పరిశోధకులు. అంటే ముందుగానే ఆ ప్రోటీన్‌ స్థాయిలను గుర్తించే అత్యాధునిక పరికం ఉంటేనే ఇదంతా సాధ్యం అని భావించారు పరిశోధకులు. ఆ ఆలోచనే ఈ కంప్యూటర్‌ ఆధారిత స్కీనింగ్‌ సాధన ఆవిష్కరణకు నాంది పలికింది.

ఇది ముందుగానే రోగి శరీరంలోని ఎన్‌ఆర్‌2ఎఫ్‌1 స్థాయిని గుర్తించి సక్రియం చేసేలా సీ26 డ్రగ్‌తో చికిత్స అందిస్తారు వైద్యులు. దీంతో రోగిలో క్యాన్సర్‌ కణాల విస్తరణ తగ్గి ఎన్‌ఆర్‌2ఎఫ్‌1 స్థాయిలు పెరుగుతాయి. వ్యొమ్‌ లైఫ్‌ సైన్స్‌ సారథ్యంలో ఆవిష్కరించిన ఈ అత్యాధునిక క్యాన్సర్‌ డిటెక్టర్‌ జస్ట్‌ రోగుల లాలాజలాంతోనే నోరు, గొంతులోని క్యాన్సర్‌ కణాలను ముందుగానే డిటెక్ట్‌ చేసేస్తుంది. నోటి లేదా గొంతు క్యాన్సర్‌ ఉన్న వ్యక్తులు, లేని వ్యక్తుల లాలాజాలం చాలా విభిన్నంగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. తాము ఈ ఏఐ ఆధారిత క్యాన్సర్‌ డిటెక్టర్‌తో దాదాపు 945 మంది నుంచి లాలాజల నమునాలను స్వీకరించామని, వాటిలో 80 నోటి క్యాన్సర్‌లు కాగా, 12 మాత్రం గొంతు క్యాన్సర్‌ నమునాలని వెల్లడించారు.

ఆయా లాలాజల్లోని శిలింధ్రం, బ్యాక్టిరియా, జన్యువులను గుర్తించేలా సాధానానికి ట్రైయినింగ్‌ ఇస్తామని చెప్పుకొచ్చారు. అధ్యయనంలో ఈ సాధనం 90% చక్కటి ఫలితాలనిచ్చిందన్నారు. తాము దీర్ఘకాలికి వ్యాధుల మూలలను గుర్తించి ముందుగానే నివారించేలా చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఈ అత్యాధునిక క్యాన్సర్‌ డిటెక్టర్‌ని కనిపెట్టామని అన్నారు. ఇదేవిధంగా ఇతర ప్రాణాంతక వ్యాధులను కూడా ముందుగానే గుర్తించేలా సాధనాలను అభివృద్ధిపరచడమే గాక ఆ సమస్యను నుంచి బయటపడేలా కొంగొత్త వైద్య విధానాలను తీసుకొచ్చేలా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు పరిశోధకులు. 

(చదవండి: మళ్లీ కరోనా రిపీటా? చైనాలో మిస్టీరియస్‌ న్యూమోనియా కలకలం..చిన్నారులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు)

Advertisement

What’s your opinion

Advertisement