విత్తన బంతి హరిత కాంతి

3 Oct, 2023 01:30 IST|Sakshi
జెండా ఊపి హెలికాప్టర్లు ప్రారంభిస్తున్న మేయర్‌, నేవల్‌ అధికారులు

డాబాగార్డెన్స్‌: అడవులు సహజ సిద్ధంగా తయారు కావాలి. గుంతలు తవ్వి, మొక్కలు నాటి అడవులు సృష్టించడం అసాధ్యం. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అడవి జీవవైవిధ్యానికి అద్దం పడుతుంది. ఇలాంటి అడవులను సృష్టించేందుకు జీవీఎంసీ కృషి చేస్తోంది. ఒకవైపు మొక్కలు నాటుతూనే మరోవైపు నగరంలో ఏడు కొండలపై సీడ్‌ బాల్స్‌ విసిరి మొక్కలు పెంచే కార్యక్రమానికి ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌, గ్రీన్‌ క్‌లైమేట్‌ సంస్థ సహకారంతో జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని సోమవారం ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద నేవల్‌ అధికారి మనీష్‌శర్మతో కలిసి మేయర్‌ హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ ప్రారంభించారు.

4 హెలికాప్టర్ల ద్వారా సుమారు 6 లక్షల విత్తనాలను సేకరించి నగరంలోని పావురాల కొండ 1, 2, కాపులుప్పాడ, సింహాచలం, పొర్లుపాలెం కొండ, వేదుళ్లనరవ కొండ, యారాడ కొండలపై విడుదల చేసినట్లు మేయర్‌ తెలిపారు. విత్తన బంతులతో విశాఖను హరిత వనం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు, హార్టికల్చర్‌ డీడీ దామోదర్‌, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ నరేష్‌కుమార్‌ పలువురు జీవీఎంసీ అధికారులు, నేవల్‌ అధికారులు, గ్రీన్‌క్లైమేట్‌ సంస్థ ప్రతినిధి జేవీ రత్నం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు