ఇలాగే ఉంటుంది.. ఉంటే ఉండండి.. లేదంటే..

17 Nov, 2023 00:28 IST|Sakshi
అధికారంలో ఉన్నప్పుడే కాదు.. విపక్షంలోనూ బడుగు, బలహీన వర్గాల పట్ల చంద్రబాబు చిన్న చూపు ప్రదర్శిస్తున్నారు. అగ్ర కులాల వారే పెత్తనం చెలాయించేలా చూస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలతో బంతాట ఆడుతూ అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్నారు. టీడీపీ పెత్తందార్ల పార్టీనే అని నిరూపిస్తున్నారు. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు.. చంద్రబాబు, చినబాబు లోకేష్‌ల ద్వంద్వ వైఖరిని చెప్పకనే చెప్పేస్తున్నాయి.

అంతటా అంతే..

ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నాయకుల మాట చెల్లడం లేదు. అధికారంలో ఉన్నప్పుడూ.. ఇప్పుడూ అగ్రకులాల వారు పెత్తనం చెలాయిస్తుండడంతో రగిలిపోతున్నారు. ఇక.. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని సామాజిక వర్గాలకు సముచితం స్థానం కల్పించారు. పెద్ద ఎత్తున రాజకీయంగానూ పదవులు కట్టబెట్టారు. చెప్పాడంటే.. చేస్తాడంటే అనేంతలా పేరు తెచ్చుకున్నారు. అన్ని వర్గాల మనసులనూ గెలుచుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీలోని బడుగు బలహీన వర్గాల నాయకులు ఇప్పటికే పలు చోట్ల అధికార పార్టీలో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వలసల తాకిడి మరింత ఎక్కువయ్యేలా కనిపిస్తోంది. టీడీపీకి బడుగు బలహీన వర్గాల నేతలు గట్టి షాక్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు