శ్రీవారి దర్శనానికి 16 గంటలు

5 Jun, 2022 04:59 IST|Sakshi
తిరుమల నడకదారిలో భక్తులతో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి

తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,196 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి 36,936 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.4.51 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్‌ లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.

దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 29 కంపార్ట్‌మెంట్‌లు నిండి ఉన్నాయి. అద్దె గదులు దొరక్క భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

నడక దారి భక్తులకు గ్రీన్‌ కార్పెట్‌
అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తులు ఎండ వేడితో కాళ్లు కాలుతూ పడుతున్న ఇబ్బందులు చూసి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చలించిపోయారు. భక్తులు కాళ్లు కాలకుండా యుద్ధప్రాతిపదికన గ్రీన్‌కార్పెట్‌ ఏర్పాటు చేయించారు.

ఆయన శుక్రవారం తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న సమయంలో నడక దారిలోని మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడివరకు భక్తులు కాళ్లు కాలుతూ పడుతున్న ఇబ్బందులను చూసి ఈ ఏర్పాట్లు చేయించారు. భక్తులు టీటీడీ చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  

మరిన్ని వార్తలు