తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 8 గంటల్లో స్వామివారి సర్వదర్శనం

2 Dec, 2023 08:10 IST|Sakshi

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్ట్‌మెంట్లు నిండాయి.శుక్రవారం 56,950  మంది స్వామివారిని దర్శించుకోగా 20,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.  
 

మరిన్ని వార్తలు