స్వచ్ఛ భారత్‌లో ఏపీకి మూడు అవార్డులు

2 Oct, 2020 17:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ : జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అవార్డుల పంట పండింది. తాజాగా కేంద్రం శుక్రవారం స్వచ్చ భారత్‌ దివస్‌కు సంబంధించిన జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌ గ్రామీణ్‌‌లో రాష్ట్రానికి తొలిసారి మూడు అవార్డులు లభించాయి. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో స్వచ్ఛ సుందర్‌ సముదాయక్‌ శౌచాలయ కేటగిరీలో రెండో ర్యాంకు, సముదాయక్‌ శౌచాలయ అభియాన్‌ కేటగిరీలో మూడవ ర్యాంక్‌, దీంతో పాటు గంధగి ముక్త్‌ భారత్‌ కేటగిరీలో మూడవ ర్యాంక్‌ లభించింది.

జాతీయ స్థాయిలో ఏపీకి అవార్డులు రావడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి ఎంతో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ మంచి సత్ఫలితాలనిచ్చింది. కాగా గతంలో ఎన్నడూ రాష్ట్రానికి ఇన్ని ర్యాంకులు దక్కలేదు. సచివాలయ వ్యవస్థతోనే జాతీయ ర్యాంకులు సాధ్యమైన వేళ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. కాగా 2014 నుంచి ప్రతిఏటా అక్టోబర్‌ 2న గాంధీ జయంతి పురస్కరించుకొని స్వచ్ఛ భారత్‌ దివస్‌గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలను స్వచ్ఛ భారత్‌ దివస్‌ కింద ర్యాంకులను ప్రకటిస్తారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు