ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

17 Mar, 2023 16:05 IST|Sakshi

Updates:

►ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.  

►శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులకు మంత్రి విడదల రజిని సవాల్ విసిరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాలం చెల్లిన మందులు చెల్లిస్తున్నారంటూ టీడీపీ ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. దమ్ముంటే చెల్లని మందులు ఎక్కడ ఉన్నాయో చూపించాలి.. ఏ ఆసుపత్రికైనా వెళ్ధాం రండి.. అంటూ మంత్రి సవాల్‌ చేశారు.

దళితుల సంక్షేమానికి పెద్దపీట: మంత్రి నాగార్జున
దళితుల సంక్షేమానికి పెద్దపీట వేశామని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. దళితుల సంక్షేమానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దళితుల కోసం రూ.52 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టామన్నారు. దేశం గర్వించేలా విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సూక్ష్మసేద్యంలో ఏపీకి దేశంలో మంచి గుర్తింపు: మంత్రి కాకాణి
డ్రిప్‌ ఇరిగేషన్‌కు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు.సూక్ష్మసేద్యంలో ఏపీకి దేశంలో మంచి గుర్తింపు లభించిందన్నారు. అవసరమైనవారందరికీ డ్రిప్‌ సదుపాయాన్ని అందిస్తామని మంత్రి అన్నారు.

రోడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి దాడిశెట్టి
రోడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. రహదారుల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 10,359 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు పూర్తి చేశామన్నారు. ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీతో కొత్త రోడ్లను పూర్తి చేశామని మంత్రి అన్నారు.

► నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

కాసేపట్లో నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. క్వశ్చర్‌ అవర్‌తో అసెంబ్లీ ప్రారంభం కానుంది. అనంతరం బడ్జెట్‌పై చర్చ జరగనుంది. శాసనమండలిలో 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభమవుతుంది. అనంతరం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ నిర్వహించనున్నారు. అనంతరం బడ్జెట్‌పై శాసనమండలి చర్చ చేపట్టనుంది.

మరిన్ని వార్తలు