Live Update
అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై సీఎం వైఎస్ జగన్ ప్రసంగం
Time: 03:32PM
Time: 03:26PM
►ఇండస్ట్రీస్, స్కిల్‌ను కనెక్ట్ చేస్తున్నాం: మంత్రి గుడివాడ అమర్నాథ్
►ఇప్పటి వరకు 72.5 శాతం ప్లేస్‌మెంట్స్ కల్పించాం.
►స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు దోచుకున్నారు.
►రూ. 3,356 కోట్ల ప్రాజెక్టు అని చెప్పి మోసం చేశారు.
Time: 03:10PM
చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ.
►సీ అంటే చంద్రబాబు.. మెన్ అంటే ఆయన మనుషులు అని అర్థం: కన్నబాబు
►చంద్రబాబు కుదుర్చుకున్న సీమెన్ ఒప్పందం అదే.
► రాష్ట్రంలో మొదలై విదేశాలకు పాకిన కుంభకోణం
► దోచిన ప్రజాధనం విదేశాలకు తరలింపు
► హవాలా మార్గంలో మళ్లీ దేశంలోకి సొమ్ముల మళ్లింపు
► చంద్రబాబు హయాంలో కేవలం స్కిల్ స్కామ్ ద్వారానే రూ. 371 కోట్లు దోపిడీ.
► చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2-3 నెలలకే స్కాం మొదలు
► తన మనుషులను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పెట్టిన బాబు.
► సీమెన్స్ ముసుగు తొడిగి అక్కడ ఉద్యోగితో లోపాయికారీ ఒప్పందం
► కేవలం ఒక నోట్ ఆధారంగా స్పెషల్ ఐటంఎగా కేబినెట్ ఆమోదం.
►సీమెన్ 90 శాతం పెట్టుబడి పెడుతుందని అబద్దాలు చెప్పారు.
►10 శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని డబ్బులు విడుదల చేశారు.
►ప్రాజెక్టు డీపీఆర్, సర్టిఫికేషన్లేకుండానే గ్రీన్ సిగ్నల్
► రూ.3,356 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం.
► జీవోలో ఇదే అంశాన్ని పేర్కొన్న బాబు సర్కార్.
► ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి జోవోల అంశాలు కనుమరుగు.
► ప్రభుత్వం ఇచ్చే దాన్ని ఆర్థిక సహాయంగా పేర్కొంటూ ఒప్పందం.
► జీవో అంశాలు, సంబంధిత లేఖలను ప్రస్తావించకుండానే సంతకాలు.
► ఒక్కపైసా సీమెన్స్ నుంచి రాకుండానే డబ్బు విడుదల.
► డబ్బు విడుదలకు ఆర్థిక శాఖ అధికారుల అభ్యంతరాలు.
► వాటిని కొట్టేసి.. తానే స్వయంగా విడుదల చేసిన చంద్రబాబు.
► తర్వాత షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్.
► జీఎస్టీ అధికారుల ఆరాతో వెలుగులోకి వచ్చిన స్కామ్.
► ఈడీ, సెబీ సోదాల్లో అవన్నీ షెల్ కంపెనీలుగా గుర్తింపు.
Time: 02:30PM
►శాసన సభకు ఎన్నో విశేషాధికారాలు ఉన్నాయి: స్పీకర్ తమ్మినేని
►ఉద్దేశపూర్వకంగా సభా కార్యక్రమాలు అడ్డుకోవడం, స్పీకర్‌ను దూషించడం, అనైతికంగా వ్యవహరిస్తే వరుసగా 5 సెక్షన్లపాటు సస్పెండ్ చేయొచ్చు.
Time: 01:30PM
►పలు శాఖల అభివృద్ధి అంశాలపై అసెంబ్లీలో చర్చ.
►వివిధ సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రులు
Time: 12:50PM
►టీడీపీ సభ్యులు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు: మంత్రి మేరుగ నాగార్జున
►చంద్రబాబు టీడీపీ సభ్యులను రెచ్చగొట్టి పంపిస్తున్నారు.
►బీసీ వ్యక్తి స్పీకర్‌గా చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు.
►ఎస్సీ సభ్యులను పురిగొల్పి స్పీకర్‌పై దాడి చేయిస్తున్నారు.
►రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు.
Time: 12:20PM
►టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం
►తాను గౌతమ బుద్దుడు కాదన్న స్పీకర్
►సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన హేయం.
►పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్ చేస్తానని రూలింగ్ ఇచ్చిన స్పీకర్.
Time: 11:50AM
►టీడీపీ సీనియర్ సభ్యులే దాడులు చేయడం దురదృష్టకరం: స్పీకర్ తమ్మినేని
►నాపై దురుసుగా ప్రవర్తించడం సీనియారిటీనా?
►బడగు, బలహీన వర్గాలంటే ఇంత చిన్న చూపా?
►నా చైర్ వద్దకు వచ్చే హక్కు సభ్యులకు లేదు.
Time: 11:20AM
►టీడీపీ సభ్యులకు సంస్కారం లేదు: మంత్రి విడదల రజని
►సభలో టీడీపీ సభ్యులు రౌడీయిజం చేశారు.
►చంద్రబాబు ప్రచార పిచ్చితో అమాయకులు బలయ్యారు.
►టీడీపీ మారణకాండకు అడ్డుకట్ట వేసేందుకే జీవో నెం.1
►స్పీకర్‌పై టీడీపీ సభ్యులు భౌతికంగా దాడి చేశారు. మంత్రి పినిపే విశ్వరూప్.
►టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
►టీడీపీ సభ్యులు మార్షల్స్‌పై కూడా దాడి చేశారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
►సభలో గొడవలు సృష్టించాలనేదే టీడీపీ కుట్ర.
►బీసీలంటే చంద్రబాబుకు చిన్నచూపు.
Time: 10:40AM
►చంద్రబాబుకు దాడులు చేయించడం అలవాటే: మంత్రి సీదిరి అప్పలరాజు.
►బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన చరిత్ర చంద్రబాబుది.
►సభలో కావాలనే టీడీపీ సభ్యులు దాడులు చేశారు
►స్పీకర్ అటెండర్‌ను పక్కకు నెట్టేశారు.
►టీడీపీ సభ్యుల దాడులను టీవీల్లో ప్రదర్శించాలి.
►సభలో టీడీపీ సభ్యుల తీరు బాధాకరం: మంత్రి అంబటి.
►చంద్రబాబు సభకు రాకుండా దాడులు చేయిస్తున్నారు.
►టీడీపీ సభ్యులకు స్పీకర్ అంటే గౌరవం లేదు.
►టీడీపీ సభ్యులు నాపై దాడి చేశారు: ఎమ్మెల్యే ఎలీజా.
►సభాపతిని టీడీపీ సభ్యులు అవమానించారు.
►టీడీపీ సభ్యులపై అట్రాసిటీ కేసు పెట్టాలి.
Time: 10:10AM
► ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
► ఒకరోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్
Time: 10:00AM
►స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.
►వైఎస్సార్సీపీ సభ్యులపై దాడికి దిగిన టీడీపీ సభ్యులు.
►సుధాకర్ బాబుపై దూషణలకు దిగిన టీడీపీ సభ్యులు.
►వారించిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను నెట్టేసిన బుచ్చయ్య చౌదరి.
►బుచ్చయ్య చౌదరి నెట్టడంతో కిందపడబోయిన వెల్లంపల్లి.
►డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై టీడీపీ ఎమ్మెల్యే డోలా దూషణలు.
►టీడీపీ ఎమ్మెల్యే డోలా నాపై దాడి చేశారు: ఎమ్మెల్యే సుధాకర్ బాబు.
►చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.
►దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు పెట్టాలి.
►సభలో గొడవ చేయించింది చంద్రబాబే.
►టీడీపీ ఎమ్మెల్యేలతో మాపై దాడి చేయించారు.
Time: 9:35AM
►ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల దౌర్జన్యం.
►స్పీకర్ పట్ల వద్ద టీడీపీ నేతల అనుచిత ప్రవర్తన.
►పేపర్లు చించి స్పీకర్‌పైకి విసిరిన టీడీపీ సభ్యులు.
►స్పీకర్ విజ్ఞప్తి చేసినా పట్టించుకోని టీడీపీ సభ్యులు
►స్పీకర్ ముఖంపై ఫ్లకార్డు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే డోలా.
►టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం.
►సభా సమయాన్ని వృథా చేయడంపై స్పీకర్ అసంతృప్తి.
Time: 9:20AM
► చంద్రబాబు, టీడీపీ నేతలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
►పట్టభద్రుల ఎన్నిక ప్రత్యేకమైన ప్రాధాన్యత క్రమంలో జరిగిన ఎన్నిక..
►చంద్రబాబు చేసుకున్నవి ఆఖరి విజయోత్సవాలు.
►2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు.
►అసెంబ్లీలో చంద్రబాబు శాశ్వతంగా అడుగుపెట్టే అవకాశం లేదు.
►ఏపీలో అకాల వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లింది.
►నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది.
►నష్టపోయిన రైతుకు ఇన్పుట్ సబ్సిడీలోపాటు బీమా పరిహారం కల్పిస్తాం.
►రైతులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
►ప్రశ్నోత్తరాలు అడ్డుకోవడం సరికాదు: మంత్రి అంబటి రాంబాబు
►సభలో కావాలనే టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారు.
►ప్రజా సమస్యలపై టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి లేదు
►సభలో అచ్చెన్నాయుడు భాష సరిగా లేదు: మంత్రి కొట్టు సత్యనారాయణ
►జీవో నెం1 అందరికీ వర్తిస్తుంది.
సాక్షి, అమరావతి: ఏడో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అనంతరం పలు శాఖల డిమాండ్లను అసెంబ్లీ ఆమోదించనుంది. 10 సవరణ బిల్లులను సభలో మంత్రులు ప్రవేశపెట్టనున్నారు.