AP-Odisha: సమస్యల పరిష్కారానికి జాయింట్‌ కమిటీ

9 Nov, 2021 11:25 IST|Sakshi

ఒడిశా ముఖ్యమంత్రితో సీఎం జగన్‌ భేటీ 

మూడు అంశాలపై ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించిన సీఎం 

Updates:
సాయంత్రం...
► ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఒడిశా సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం వైఎస్‌ జగన్‌ చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్‌ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. వంశధార నదిపై నేరేడి  బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్‌తో చర్చించారు.

చదవండి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

పోలవరం ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల సమస్యపై సీఎంలు చర్చించారు. బహుదానది నీటి విడుదలపై కూడా ముఖ్యమంత్రులు చర్చించారు. ఇంధన రంగంలో బలిమెల, ఎగువ సీలేరు కోసం ఎన్‌వోసీ, యూనివర్శిటీల్లో ఒడిశా, తెలుగు భాషాభివృద్ధికి కృషి.. తీవ్రవాదం, గంజాయి నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి భేటీలో పాల్గొన్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఒడిశా తెలుగు అసోసియేషన్‌ సభ్యులు కలిశారు.

మధ్యాహ్నం..
ముందుగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆశీర్వదించారు.

ఉదయం...
విశాఖపట్నం: భువనేశ్వర్ పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పలువురు ప్రజా ప్రతినిధులు కలిశారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వివిధ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులోని గ్రామాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: Andhra Pradesh: ఆ మూడూ ముఖ్యం

మరిన్ని వార్తలు