ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

29 Jun, 2021 19:37 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించబడలేదని.. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం పాలసీ ప్రకారం 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించారని.. ఇందులో చాలా వ్యాక్సిన్లు మిగిలిపోయాయని సీఎం లేఖలో పేర్కొన్నారు.

‘‘జులై నెలలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు 17,71,580 డోసులు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేట్‌ ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశం లేదు. ప్రైవేట్‌ ఆస్పత్రులు తీసుకోనటువంటి వ్యాక్సిన్‌ నిల్వలను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని’’ సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఈనెల 24న జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ, ఇతర రాష్ట్రాలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయని లేఖలో సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

చదవండి: సీఎం జగన్‌ అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం
ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్

మరిన్ని వార్తలు