మరో 51,390 మందికి ‘జగనన్న చేదోడు’

10 Nov, 2020 04:03 IST|Sakshi

నేడు రూ.51.39 కోట్లు నగదు బదిలీ చేయనున్న సర్కారు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలను అర్హత గల ప్రతి ఒక్కరికీ (సంతృప్త స్థాయిలో)అందించాలన్న లక్ష్యంలో భాగంగా ‘జగనన్న చేదోడు’ పథకం కింద మరో 51,390 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నగదు బదిలీ చేయనుంది. ఈ పథకం కింద ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి బదిలీ చేస్తారు. గతంలోనే 2,47,040 మంది రజకులు, టైలర్లు, నాయీబ్రాహ్మణులకు రూ.247.04 కోట్లను సీఎం జగన్‌ అందించారు.

పొరపాటున ఇంకా ఎవరైనా మిగిలిపోతే పేర్లు నమోదు చేసుకునేందుకు నెల గడువు ఇస్తున్నామని, సాయం అందని అర్హులు కంగారుపడాల్సిన అవసరం లేదని సీఎం జగన్‌ ఆ సందర్భంగా స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం ‘జగనన్న చేదోడు’ పథకం లబ్ధి పొందని వారి నుంచి మరోమారు దరఖాస్తులు ఆహ్వానించింది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను వలంటీర్ల ద్వారా పరిశీలన జరిపించి అర్హులైన 51,390 మందిని ఎంపిక చేశారు. వీరికి రూ.51.39 కోట్లు బదిలీ చేయనున్నారు. 

మరిన్ని వార్తలు