పెట్టుబడులకు అత్యుత్తమం

5 Mar, 2023 04:23 IST|Sakshi

దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీ కీలక పాత్ర

ఈవోడీబీలో మూడేళ్లుగా నంబర్‌వన్‌ సామాన్య విషయం కాదు

విజనరీ లీడర్‌షిప్‌తోనే ఆ ఘనత సాధ్యం

అనుమతుల మంజూరులో అత్యుత్తమం

దిగ్గజ ఫార్మా కంపెనీలన్నీ రాష్ట్రంలో ఉన్నాయి

 ప్రముఖ పారిశ్రామికవేత్తల ప్రశంసలు 

సాక్షి, విశాఖపట్నం: అక్షర క్రమంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ముగింపు సదస్సులో పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు. విజనరీ లీడర్‌ షిప్‌తో అన్ని రంగాల్లో ఏపీ దూసుకెళుతోందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని కొనియాడారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను తమ తొలి ప్రాధాన్యతగా ఎంపిక  చేసుకుంటామని స్పష్టం చేశారు. 

ఒక్క ఫోన్‌ కాల్‌ చాలు.. 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పట్ల పరిశ్రమల యాజమాన్యాలన్నీ పూర్తి విశ్వాసంతో ఉన్నాయి. 11.47 శాతం వృద్ధితో ఏపీ అగ్రభాగంలో ఉండటం గర్వకారణం. దూరదృష్టి కలిగిన నాయకత్వం ఆధ్వర్యంలో రూపొందించిన పారిశ్రామిక పాలసీ అద్భుతమని అందరి మాటగా చెబుతున్నా. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములుగా మారినందుకు సంతోషంగా ఉంది. రెండు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన సదస్సులో ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా అందర్నీ ఆకట్టుకుంది. ఆయన చెప్పిన మాట నిజంగా వాస్తవం. ఫోన్‌ చేస్తే ఏ సమస్యనైనా పరిష్కరిస్తున్నారు. – గజానన్‌ నబర్, నోవా ఎయిర్‌ సీఈవో, ఎండీ

అసాధారణ ఘనత.. 
ప్రపంచమంతా పునరుత్పాదక ఇంధనం వైపు పయ­ని­స్తోంది. ఈ రంగం­లో ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది. ఏపీలో పంప్డ్‌ హై­డ్రో ప్రాజెక్టు­లకు అనువైన స్థలాలను  గుర్తించగలిగాం. సోలార్, విండ్, పంప్డ్‌ హైడ్రో పవర్‌ ఉత్పత్తిలో ఏపీ ప్రపంచంలోనే నంబర్‌­1 గా ఎదిగే అవకాశాలున్నాయి. దీని వెనుక సీఎం జగన్‌ అకుంఠిత దీక్ష ఉంది. గ్రీన్‌ అమ్మో­నియా, గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజె­క్టుల­తో పాటు సోలార్, విండ్, హైడ్రో ప్రాజెక్ట్‌లలో ఇంటి­గ్రేటె­డ్‌ ఎనర్జీ రంగంలో ఏపీలో భారీగా పెట్టు­బడు­లు పెడతాం.

కర్బన రహిత పర్యావ­రణం కో­సం ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌­లో మూడేళ్లుగా తొలి స్థానంలో నిలవడం సాధారణ విషయం కాదు. పారిశ్రామిక వాతా­వరణం అద్భుతంగా ఉండటం వల్లే ఇక్కడ పెట్టు­బ­డులు పెట్టేందుకు  వస్తు­న్నాం. దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది. – వినీత్‌ మిట్టల్, ఆవాదా గ్రూప్‌ చైర్మన్‌

చురుకైన ప్రభుత్వం.. 
రాష్ట్ర విభజన తర్వాత బల్క్‌ డ్రగ్‌ క్యాపిటల్‌గా ఏపీ మారింది. రాష్ట్రంలో కొన్ని అతిపెద్ద ఏపీఐ యూనిట్లు పని­చేస్తున్నాయి. మేం 2007లో ఒక ఉద్యో­గి స్థాయి నుంచి 8 వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగామంటే సీఎం జగన్‌ అందించిన సహకారమే కారణం. ఇక్కడి ప­ర్యావరణ వ్యవస్థ, చురుకైన ప్రభుత్వం, నిపు­ణులైన అధికారులు, నాయకులు ఎల్లప్పు­డూ అందుబాటులో ఉండటం వల్లే అది సాధ్యమైంది. ఏపీకి ప్రత్యేకంగా మార్కెట్‌ అవసరం లే­దు.

పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా పెడి­తే పెట్టుబడులు వస్తాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే డ్రగ్‌ కంట్రోలర్‌ అనుమతులతో సహా ప్రక్రియను వేగంగా నిర్వహించేలా డిజిటల్‌ డ్రైవ్‌లోనూ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ప్రపంచానికి కావాల్సిన ఔషధాలు ఏపీలో తయా­ర­వుతున్నాయి.  – సూర్యనారాయణ చావా,  లారస్‌ ల్యాబ్స్‌ ఫౌండర్, సీఈవో

పరిశ్రమలు కోరుకునే  సుస్థిర వాతావరణం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమర్థ నాయకత్వం కారణంగా సమ్మిట్‌లో అనూహ్యరీతిలో పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు కోరుకునే సుస్థిర విధానాలు, ఆహ్లాదకరమైన వాతావరణం రాష్ట్రంలో ఉంది. ఏపీలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైనందుకు ఆనందంగా ఉంది.

పెట్టుబడుల్ని క్రమంగా ఇక్కడ విస్తరిస్తాం. నాణ్యమైన మానవ వనరులను అందించడం, పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడంలో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉంది. ఏ సమస్య వచ్చినా ఉన్నతాధికారులు సత్వరమే స్పందించి పరిష్కరిస్తున్నారు. ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్న చేతల ప్రభుత్వం ఏపీలో ఉన్నందున నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టవచ్చు.  – సంతానం, సెయింట్‌ గోబెన్‌ సీఈవో

96 సేవలు ఒకే చోట 
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతా­వరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. కొత్తగా వచ్చే పరిశ్రమలకు 21 రోజు­ల్లో అన్ని అనుమ­తుల­ను మంజూరు చేస్తు­న్నాం. 24 ప్రభుత్వ శాఖలకు చెందిన 96 సేవల్ని ఒకే చోట చేర్చి సింగిల్‌ విండో సి­స్టమ్‌ ద్వారా అను­మతులను మంజూరు చేస్తున్నాం. ఏపీ­లో పెట్టుబ­డులు పెట్టేందుకు వచ్చే ప్రతి సంస్థకు పూర్తి స్థాయి మద్దతిస్తూ ప్రతి విషయంలోనూ సహకరిస్తాం.  – డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

రెండేళ్లలో రూ.రెండు వేల కోట్లు 
కోవిడ్‌ తర్వాత ఫార్మా రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భారత్‌ను ఫార్మా స్యూటికల్‌ రంగంలో భాగస్వామిగా చేసుకునేందుకు అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. ఇప్పటికే ఫార్మా రంగంలో ఏపీ తనదైన ముద్ర వేసింది. ఇక్కడి పర్యావరణ వ్యవస్థ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనుకూలంగా ఉంది.

రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, చూపిస్తున్న చొరవ, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకారం కారణంగా ఏపీ వైపు చూస్తున్నాం. రాబోయే రెండేళ్లలో ఏపీలో రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెడతాం. దీని ద్వారా కనీసం 3,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – వంశీకృష్ణ, హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండీ

మరిన్ని వార్తలు