ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా..!

31 Aug, 2023 04:04 IST|Sakshi

అంబేడ్కర్‌ స్మృతి వనంలో విగ్రహ నిర్మాణం పూర్తి

కొనసాగుతున్న హరిత వనాలు, సుందరీకరణ పనులు

నవంబర్‌ 26న ప్రారంభానికి సన్నాహాలు

సాక్షి ప్రతినిధి, విజయవాడ:  విజయవాడలోని స్వ రాజ్య మైదానంలో అంబేడ్కర్‌ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. నవంబర్‌ 26న స్మృతి వనం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షించే వేదిక కానుంది. ఈ పనులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సూచనలు చేస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహం సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలవనుంది. 18.18 ఎకరాల్లో రూ.400 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పూర్తిస్థాయిలో విగ్రహ భాగాలు బిగి­ంచారు. సెంట్రింగ్‌ కర్రలు మాత్రమే తొలగించాల్సి ఉంది.

అంబేడ్కర్‌ జ్ఞాపకాలను గుర్తు చేసు­కునేందుకు వీలుగా డిజిటల్‌ మ్యూ  జియం, మినీ థియేటర్‌ నిర్మా­ణం పనులు పూర్తి కావచ్చాయి. ప్రహరీ, మరికొన్ని అదనపు పనుల కోసం అదనంగా రూ.106 కోట్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. లైటింగ్, గ్రానైట్, పాత్‌వే, వాటర్‌ ఫౌంటైన్, వెహికల్‌ పార్కింగ్, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్‌ స్కేపింగ్, గ్రీనరీ, సుందరీకరణ తదితర పనులు వేగంగా సాగుతున్నాయి. రేయింబవళ్లు వందలాది కార్మికులు, భారీ యంత్రాలతో పనులు సాగేలా అధికారులు చూస్తున్నారు.

మంత్రుల సబ్‌ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ నిర్మాణ పనులను పరిశీలిస్తోంది. మునిసిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి పనులను పర్యవేక్షిస్తున్నారు. రాత్రి సమయాల్లో సైతం పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తూ పనుల వేగం పెంచుతున్నారు. నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు.

తుది దశకు పనులు
అంబేడ్కర్‌ స్మృతి వనం ప నులు వేగంగా సాగుతు­న్నాయి. విగ్రహానికి సంబంధించిన డిజైన్లు, ఢిల్లీ నుంచి వచ్చిన స్మృతివనం నిర్మాణం డిజైన్స్‌ ఆ ధారంగా పొరపాట్లకు తావు లేకుండా నాణ్య తా ప్రమాణాలు పాటించాం. సీలింగ్, ప్లాస్టింగ్‌ పనుల్లో జాప్యం లేకుండా చేస్తున్నారు.

పనుల నాణ్యతా ప్రమాణాలను క్వాలిటీ కంట్రోల్‌ అ ధికారులు తనిఖీ చేస్తున్నారు. కారిడార్‌ మొ త్తం గ్రానైట్‌ ఫుట్‌పాత్, ల్యాండ్‌ స్కేప్, కాంపౌండ్‌ నిర్మాణం తుది దశకు చేరుకుంటున్నా యి. పార్కింగ్‌ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంగణంలో అందమైన మొక్కలతో ప్లాంటేషన్‌ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. 
– స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, మునిసిపల్‌ కమిషనర్, విజయవాడ

మరిన్ని వార్తలు