టీడీపీలో అసమ్మతి సెగ.. దేవినేని ఉమకు షాక్‌!

7 Nov, 2022 12:59 IST|Sakshi

సాక్షి, ఎన్టీఆర్‌: మైలవరం టీడీపీలో అసమ్మతి సెగ బయటకు వచ్చింది. మాజీ మంత్రి దేవినేని ఉమాపై అసమ్మతి వర్గం భగ్గుమంది. టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు నిర్వహించిన సభలో దేవినేని వద్దు బొమ్మసాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఆత్మీయ సమావేశం బ్యానర్‌లో దేవినేని ఉమ ఫొటోకు చోటు దక్కకపోవడం విశేషం. 

ఈ క్రమంలో మైలవరం టికెట్‌ సుబ్బారావుకే ఇవ్వాలని స్థానిక టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. ‘మీటింగ్‌ పెడితే కొందరు కంగారు పడుతున్నారు. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి తప్పు చేశాను. అప్పుడు లబ్ధి పొందినవారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు