వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై బాంబు దాడి

24 Jan, 2021 20:22 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా ఇప్పటికే అనేక దాడులకు పాల్పడుతున్న పచ్చపార్టీ శ్రేణులు.. మరో దారుణానికి ఒడిగట్టారు. చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త మల్లికార్జునపై ఆదివారం సాయంత్రం టీడీపీ నేతలు హత్యయత్నానికి యత్నించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇలాకాలో  దౌర్జన్యకాండకు దిగారు. మరికుంటపల్లి వద్ద వ్యక్తిగత పని నిమిత్తం వెళ్లిన మల్లికార్జునపై బాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకోగా.. మల్లికార్జున భార్య నాగవేణికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానికుల సహాయంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. టీడీపీకి చెందిన నాగరాజు, రెడ్డయ్య, ఈశ్వరయ్యలు తనను చంపడానికి ప్రయత్నించారని బాధితుడు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. (బాబు జమానాలో అంతులేని నిర్బంధకాండ)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు