విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు

10 Nov, 2023 03:36 IST|Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో జరుగుతోన్న నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా­ను, పాక్షికంగాను రద్దు చేసి కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌వో నుస్రత్‌ మండ్రుపక్కర్‌ గురువారం తెలిపారు.  

రద్దైన రైళ్లు: ఈ నెల 13–19 వరకు కాకినాడ టౌన్‌–విశాఖ (17267/17268), గుంటూరు–రాయగడ (17243), విజయవాడ–తెనాలి (07279/07575),  విజయవాడ–ఒంగోలు (07461/­07576), విజయవాడ–గూడూరు (07500/07458), బిట్రగుంట–విజయవాడ (07977/­07978), రాజమండ్రి–విశాఖ (07466/07467), మచిలీపట్నం–విశాఖ (17219),గుంటూరు–విశాఖ (17239), 14–20 వరకు విశాఖ–మచిలీపట్నం (17220), రాయగడ–గుంటూరు (17244), 13, 14, 15, 17, 18 తేదీల్లో విజయవాడ–విశాఖ (22702/­22701), విశాఖ–గుంటూరు (17240), ఈ నెల 13–17 వరకు బిట్రగుంట–చెన్నై సెంట్రల్‌ (17237/17238).    

పాక్షికంగా రద్దైన రైళ్లు: ఈ నెల 13–19 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్‌–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866/07770), విజయవాడ–భీమవరం (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్‌ (07861) రైళ్లు విజయవాడ–రాయనపాడు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. 

దారి మళ్లింపు: ఈ నెల 13న యర్నాకులం–పాట్నా (22643), 18న భావ్‌నగర్‌–కాకినాడ పోర్టు (12756),15న బెంగళూరు–గౌహతి (12509), 13, 15, 17, 18 తేదీలలో ఛత్రపతి శివాజీ టర్మినల్‌–భువనేశ్వర్‌ (11019) రైళ్లు విజయవాడ, గుడి­వాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు.

మరిన్ని వార్తలు