పర్యావరణ హితమే లక్ష్యంగా....

26 Aug, 2022 04:26 IST|Sakshi
పంపిణీకి సిద్ధమైన మట్టి విగ్రహాలు

చంద్రగిరిలో 1.24 లక్షల మట్టి వినాయక విగ్రహాల తయారీ 

ప్రతి ఇంటికీ ఉచిత పంపిణీకి సన్నద్ధం

ఎమ్మెల్యే చెవిరెడ్డి వెల్లడి  

తిరుపతి రూరల్‌: పర్యావరణ హితమే లక్ష్యంగా..ప్రభుత్వ విప్, తుడా చైర్మన్‌ డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 1.24 లక్షల బంకమట్టి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా చెవిరెడ్డి బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గురువారం తిరుచానూరు మార్కెట్‌ యార్డ్‌లో బంకమట్టి విగ్రహాల తయారీని ఆయన పరిశీలించారు. విగ్రహాల తయారీకి అవసరమైన బంకమట్టి మిశ్రమాన్ని కలపడంలో కుమ్మరి కార్మికులతో కలిసి పాలుపంచుకున్నారు. చెవిరెడ్డి మాట్లాడుతూ..చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఏటా, ప్రతి ఇంటికీ బంకమట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను పంపిణీతో పాటు పూజించేలా ప్రోత్సహించటం ఆనవాయితీగా వస్తోందన్నారు.

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 25 ప్రదేశాల్లో.. 7 వేల మంది కుమ్మరి కార్మికులు 25 రోజులుగా బంకమట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారని, 2,500 టన్నుల బంకమట్టిని ఉపయోగించినట్లు చెప్పారు. ప్రజలకు గణనాథుని పూజించే విధానంపై బుక్‌లెట్‌ను అందించనున్నట్లు తెలిపారు. 2వేల మంది వలటీర్లతో ఈ విగ్రహాలను ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు