రన్నింగ్‌లో లారీ.. లోపలినుంచి అద్దాలు తుడుస్తుండగా..

2 Aug, 2021 16:30 IST|Sakshi
వెంకటరావుకు చికిత్స చేస్తున్న 108 వాహన సిబ్బంది

శ్రీకాకుళం : కదులుతున్న లారీ అద్దాలు తుడుస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి క్లీనర్‌ కె.వెంకటరావు గాయపడ్డాడు. ఈ సంఘటన బొంతపేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీలో ఉన్న వెంకటరావు లోపల ఉండే అద్దాలు తుడుస్తున్న క్రమంలో అవి ఊడిపోయాయి. దీంతో పట్టుతప్పి రోడ్డుపై పడిపోవడంతో కాలు, తలకు గాయాలయ్యాయి. డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేసి లారీని నిలిపి వేయడంతో క్లీనర్‌కు ప్రాణాపాయం తప్పింది. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు.

మరిన్ని వార్తలు