‘జలశక్తి శాఖలో పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌ ఏదీ పెండింగ్‌లో లేదు’

2 Aug, 2021 16:37 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను అడ్వైజరీ కమిటీ 2011లో ఒకసారి, ఆ తర్వాత ఫిబ్రవరి 2019లో ఆమోదించిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా సోమవారం రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి షేకావత్‌ సమాధానం ఇస్తూ.. జలశక్తి శాఖలో పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌ ఏదీ పెండింగ్‌లో లేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 2005-06 లెక్కల ప్రకారం రూ.10,151.04 కోట్ల అచనాలతో డీపీఆర్‌ను ఆమోదించామని తెలిపారు. 2009 జనవరి 20న ఈ డీపీఆర్‌ను జలశక్తి శాఖలోని ఫ్లడ్‌ కంట్రోల్‌ అండ్‌ మల్టీపర్పస్‌ ప్రాజెక్ట్‌ 95వ మీటింగ్‌లో ఆమోదించిందని తెలిపారు.

మరిన్ని వార్తలు