పార్లమెంట్‌ సెషన్‌: ఎంపీలతో సీఎం జగన్‌ భేటీ

13 Sep, 2020 20:39 IST|Sakshi

 సాక్షి, అమరావతి : పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం వీడియో కాన్సరెన్స్‌ ద్వారా ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల సాధనపై సీఎం జగన్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని ఎంపీలకు సూచించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రయోజిత పథకాల నిధులతో పాటు ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధన అజెండాగా సమావేశం నిర్వహించనున్నారు. (ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతాం: మిథున్‌రెడ్డి)

మరోవైపు కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన సహాయంపై ఎంపీలతో చర్చించనున్నారు. అన్ని ఫార్మాట్ల అవకాశాలను పార్లమెంట్‌లో వినియోగించుకునేలా సీఎం జగన్‌ రేపటి సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే నిర్వహించిన బీఏసీ సమావేశాంలో పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి ఏపీ డిమాండ్స్‌ను వినిపించారు. కరోనా నియంత్రణ చర్యలు, భారత్-చైనా సరిహద్దు వివాదాలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని స్పీకర్‌ కోరినట్లు మిథున్‌రెడ్డి తెలిపారు. (పార్లమెంట్‌లో కరోనా కలకలం..!)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు