రేపు రాజమండ్రికి సీఎం జగన్‌.. ఎమ్మెల్యే జ్యోతుల కుమార్తె వివాహానికి హాజరు

29 Aug, 2023 08:56 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం రాజమండ్రికి వెళ్లనున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహానికి సీఎం జగన్‌ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3:50 గంటలకు హెలికాప్టర్‌లో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలకు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. స్థానిక నేతలతో మాట్లాడనున్నారు.

అనంతరం సాయంత్రం 4.10 గంటలకు మంజీరా కన్వెన్షన్ హాల్‌కు చేరుకోనున్నారు. అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. తర్వాత 4.25 గంటలకు తిరిగి తాడేపల్లికి బయలుదేరనున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ మాధవి లత, ఎస్పీ సతీష్ పరిశీలించారు.
చదవండి: సీఎం జగన్‌ ఆదేశం.. దివ్యాంగుడికి ఆధునిక కృత్రిమ కాలు

మరిన్ని వార్తలు