సీఎం జగన్‌కు కాలినొప్పి.. ఒంటిమిట్ట పర్యటన రద్దు

4 Apr, 2023 20:29 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కాలినొప్పి కారణంగా రేపటి వైఎస్సార్‌ జిల్లా పర్యటన రద్దు అయ్యింది. ఉదయం ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న సమయంలో ఆయనకు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి పెరిగింది.

గతంలో ఇలానే కాలికి గాయం కాగా, చాలా రోజులపాటు సీఎం ఇబ్బందిపడ్డారు. తాజాగా మళ్లీ కాలినొప్పి రావడంతో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో రేపటి ఒంటిమిట్ట పర్యటనను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
చదవండి: 2023-24 ఏపీ సంక్షేమ పథకాల క్యాలెండర్‌.. షెడ్యూల్‌ ఇదే..

5న ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు:
ఈ నెల 5న ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణం నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. మళ్లింపు ఈ నెల 5 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. భక్తుల వాహనాలు మినహా ఎలాంటి ఇతర వాహనాలు అనుమతించరని ఎస్పీ తెలిపారు.

వాహనాల దారి మళ్లింపు వివరాలు:
కడప నుండి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్ పల్లి ఇర్కాన్ జంక్షన్ నుండి ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్ళాలి
తిరుపతి నుండి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుండి దారి మళ్లింపు.. వయా రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి
రాజంపేట వైపు నుండి వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా దారి మళ్లింపు
రాజంపేట వైపు నుండి వచ్చే ద్విచక్ర వాహనాలు సాలాబాద్ నుండి ఇబ్రహీం పేట, మాధవరం మీదుగా దారి మళ్లింపు

15 చోట్ల పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు
రాజంపేట వైపు నుండి వచ్చే ద్విచక్ర వాహనాలను సాలాబాద్ సమీపంలో 5 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో క్రమపద్ధతిలో నిలపాలి
కల్యాణ వేదిక నుండి కడప మార్గంలో 10  పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు

మరిన్ని వార్తలు