వారికి తక్షణమే పరిష్కారం చూపాలి: సీఎం జగన్‌

27 Apr, 2021 13:26 IST|Sakshi

104 కాల్ సెంటర్ సమర్ధవంతంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలి

104కు ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలి

జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్‌ స్పందన వీడియో కాన్ఫరెన్స్‌

కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై సీఎం దిశానిర్దేశం 

సాక్షి, అమరావతి: 104 కాల్ సెంటర్ సమర్ధవంతంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆయన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తూ.. 104కు ఫోన్‌ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. కోవిడ్‌ సమస్యలకు 104 నంబర్‌ వన్‌స్టాప్‌గా ఉండాలని పేర్కొన్నారు.

‘‘104కు ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలి. 104 కాల్‌ సెంటర్‌కు వైద్యులు అందుబాటులో ఉండాలి. జాయింట్ కలెక్టర్లు ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. జిల్లా స్థాయిలో కోవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించాలి. జిల్లా స్థాయి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేయాలి. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది పూర్తిస్థాయిలో ఉండాలి. ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

చదవండి: ఉత్పత్తికి ఊపిరి: రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లకు జవసత్వాలు
కోవిడ్‌ కట్టడికి త్రిముఖ వ్యూహం

>
మరిన్ని వార్తలు