మహిళ ఆవేదన..చలించిపోయిన సీఎం జగన్‌

3 Dec, 2021 18:04 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: నాయకుడు అంటే.. అందలం ఎక్కి అధికారం అనుభవించేవాడు కాదు. తనను నమ్ముకున్న జనాలకు కష్టం వస్తే.. నేనున్నాంటూ ధైర్యం చెప్పాలి. సమస్య వస్తే.. ప్రజాక్షేత్రంలోకి దిగి.. వాటిని పరిష్కరించాలి. బాధల్లో ఉన్న వారిని ఓదార్చి అక్కున చేర్చుకోవాలి. ఆదుకుంటానని హామీ ఇవ్వాలి.

గడిచిన రెండు రోజులుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాక ఆదుకుంటానని హామీ ఇచ్చారు. నెల్లూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్‌ ఓ మహిళ ఆవేదన చూసి చలించిపోయారు. తక్షణమే ఆమె సమస్యను పరిష్కరించారు. ఆ వివరాలు..

 
సీఎం జగన్‌ నెల్లూరు భగత్‌సింగ్‌ కాలనీలో పర్యటిస్తుండగా..  వేళాంగిణి అనే మహిళ వచ్చి తన సమస్యలను చెప్పుకుంది. ఆమె ఆవేదిన విని చలించిపోయారు సీఎం జగన్‌. అక్కడే ప్రజల సమక్షంలో ఆమెను ఆదుకుంటానని తెలిపారు. వేళాంగిణి కుమారుడికి ఉద్యోగం కల్పించి ఆదుకుంటానని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. బాధితుల గోడు విని.. తక్షణమే స్పందించిన సీఎం జగన్‌పై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎంతో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థినిలు, మహిళలు పోటీలు పడ్డారు. . 


(చదవండి: దేవుడిలా ఆదుకున్నావన్నా..)
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి  రెండు రోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. నెల్లూరు జిల్లా వరద ప్రభావిత దామరపాలెం, జొన్నవాడ,పెనుబల్లి, భగత్ సింగ్ కాలనీల్లో పర్యటించారు సీఎం జగన్‌. బాధితులకు అందిన సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.

రెండు రోజలు పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్‌ ముంపు బాధితులకు అందిన సహాయక చర్యలపై ఆరా తీశారు. నష్టపోయిన ప్రతీ కుటుంబానికీ అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. వరద సహాయక చర్యలపై ముంపు వాసులు సంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణ సహాయం అందటం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు. 
(చదవండి: వరదల్లో ఇళ్లు కోల్పోయినవారికి 5 సెంట్ల స్థలం: సీఎం జగన్‌)

బేఎంఆర్ ట్రస్ట్ తరపున బీదా మస్తాన్‌ రావు వరద సహాయం కోసం కోటి ఒక లక్ష రూపాయల చెక్కును సీఎం జగన్‌కు అందచేశారు. డీసీఎంఎస్ నిధుల నుంచి 25 లక్షల రూపాయల వరద సహాయం చెక్కు సీఎంకి అందచేశారు చైర్మన్‌ వీరి చలపతి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగిసిన అనంతరం సీఎం జగన్‌ తిరుగుపయనయ్యారు.

చదవండి: వరద సాయం అందనివారు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేయండి: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు