రేపు గవర్నర్‌ను కలవనున్న సీఎం జగన్‌

3 Aug, 2021 19:52 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(బుధవారం) సాయంత్రం మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కాగా, మంగళవారం గవర్నర్‌ పుట్టిన రోజు సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ ఆయన సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు