ఏపీకి తుపాను ముప్పు.. రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు

1 Dec, 2023 11:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి తీవ్రవాయుగుండంగా, ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

సోమవారం సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డా. అంబేద్కర్ వెల్లడించారు.
చదవండి: మనసున్న మారాజు సీఎం వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు