మిచౌంగ్‌ ముంచేసింది.. తీరం దాటింది.. అప్‌డేట్స్‌

5 Dec, 2023 21:06 IST|Sakshi

cyclone michaung Live Updates..

బాపట్ల జిల్లా:

  • అద్దంకి లో మిచౌంగ్ తూపాను ప్రభావంతో పొంగిపొర్లుతున్న వాగులు
  • నల్లవాగు, దోర్నపువాగు ఉధృతంగా ప్రవహించడంతో నిలిచిన రాకపోకలు
  • అద్దంకి, పరిసర ప్రాంతాలలో విరిగిపడ్డ చెట్లు, నిలిచిన విద్యుత్ సరఫరా

రేపు పాఠశాలలు, కళాశాలలకు సెలవు
►భారీ వర్షాలు కారణంగా రేపు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

తీరం దాటిన మిచౌంగ్‌ తుపాను

  • 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటిన తీవ్ర తుపాను
  • తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు
  • రాగల రెండు గంటల్లో తుపానుగా బలహీనపడనున్న తీవ్ర తుపాను 
  • తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ
  • కోస్తా జిల్లాలకు భారీ  వర్ష సూచన

కాకినాడ జిల్లా

  • తుపాను ప్రభావంతో గడిచిన 24 గంటలలో జిల్లా వ్యాప్తంగా నమోదయిన వర్షపాతం
  • జిల్లా వ్యాప్తంగా 990.6 మి.మి
  • అత్యధికంగా కాజులూరు మండలం 79.08 మి.మి, తాళ్లరేవు 73.08 మి.మి వర్షపాతం
  • అత్యల్పంగా రౌతులపూడి మండలంలో 24 మి.మి నమోదు
  • కాకినాడ రూరల్ 72.6. మి.మి, కాకినాడ అర్భన్ 60.2 మి.మి వర్షపాతం నమోదు

కోనసీమ

  • పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పినిపే విశ్వరూప్‌
  • భగవంతుడి దయవల్ల కోనసీమపై మిచౌంగ్ ప్రభావం పెద్దగా లేదు
  • ఇప్పటికే లక్షా ఆరు  వేల ఎకరాల్లో పంట కోతలు పూర్తయ్యాయి
  • ఇంకా 51 వేల ఎకరాల్లో మాత్రమే కోతలు కోయాల్సి ఉంది
  • దాదాపు తొమ్మిది వేల ఎకరాలపై తుఫాన్ ప్రభావం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా
  • తడిచిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కచ్చితంగా కొనుగోలు చేస్తాం

మిల్లర్లకు ఆదేశాలు.. ప్రత్యేక అధికారిణి జయలక్ష్మి

  • కోనసీమలో పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాం
  • సీఎం జగన్ ఆదేశాల మేరకు తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మిల్లర్లను ఆదేశించాం
  • రైతుకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నాం

రైతుల్ని ఆదుకుంటాం.. కలెక్టర్ హిమాన్షు శుక్లా 

  • చేలలో నీరు నిల్వ ఉండకుండా జాతియ ఉపాధి హామీ పథకం కూలీలను పెట్టి నీటిని బయటికి తోడిస్తున్నాం
  • దీనివల్ల నేలనంటిన పైరు సైతం నష్టపోకుండా ఉంటుంది
  • ప్రాథమికంగా తొమ్మిది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించాం
  • నక్కా రామేశ్వరం వద్ద డ్రైన్‌కు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయడంతో చేయడంతో వర్షపు నీరు చాలా వరకూ బయటకు పోతుంది
  • సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలు ప్రజల్ని ఆదుకుంటున్నాం


పశ్చిమగోదావరి జిల్లా
► మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ మోళ్లపర్రు లో పర్యటించి పునరావాస కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు 
► ఈడురు గాలులు ఎక్కువగా ఉన్నందున దయచేసి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు.
► ఇళ్ళ నుండి బయటకు రావొద్దు.. పిడుగులు పడే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి.
► పునరావాస కేంద్రాలకు రావాలి.. అన్ని సదుపాయాలను కల్పించడం జరిగింది.
► పోలీస్,రెవెన్యూ,ఎలక్ట్రికల్,ఇతర అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయటం జరిగింది.

ఏలూరు జిల్లా
►తూఫాన్ నేపథ్యంలో  వాతారవరణ హెచ్చరికల మేరకు  ఏలూరు జిల్లాలో జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు . 
►ఏలూరు  జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్  18002331077. 
►సబ్ కలెక్టర్ కార్యాలయం నూజివీడు : 08656-232717
►ఆర్డీఓ కార్యాలయం, జంగారెడ్డిగూడెం : 9553220254
►ఆర్డీఓ కార్యాలయం, ఏలూరు - 8500667696

కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
►కంట్రోల్ రూమ్ లను  అత్యవసర సహాయం కోసం వినియోగించుకోవాలి. 
►లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలి.
►నేడు, రేపు  భారీ, అతి భారీ వర్షాలు ఉంటాయి 
►ప్రజలు అవసరమైతే తప్ప ఇంటిని వదిలి బయటికి రావద్దు.
►బలహీనంగా వున్న ఏటిగట్లు, వంతెనలు, తదితర ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త  చర్యలకు అధికారులకు ఆదేశాలు జారీ.

ప్రకాశం జిల్లా:
►మిచౌంగ్ తుఫాన్ కారణంగా సంతనూతలపాడు మండలం మంగమూరు-ఒంగోలు మధ్యలోనీ  రోడ్డుపై పారుతున్న వర్షపు  నీరు
►రాకపోకలు  అంతరాయం
►రెండు రోజుల వరకు ఈ రోడ్డులో ఎవరు ప్రయాణం చేయవద్దని సూచించిన అధికారులు
►దగ్గరుండి సహాయ చర్యలు చేపడుతున్న  ఎమ్మార్వో మధుసూదన్ రావు, సిబ్బంది

 నెల్లూరు జిల్లా:  
►ఉలవపాడు మండలంలోని తుపాను పునరావాస కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి.
►బాధితులను పరామర్శించి భోజన ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. 
►నిర్వాసితులకు బ్రెడ్, బిస్కెట్లు అందజేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:
►సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో మినీ టోర్నడో బీభత్సం
►విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తో పాటు పలు దుకాణాలు ధ్వంసం

కృష్ణాజిల్లా 
►జిల్లాలో 25 మండలాల పై మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ 
►పంట నష్టం పై ప్రాధమిక అంచనా 
►68392 హెక్టార్లలో వరి,212 హెక్టార్లలో పత్తి, 162 హెక్టార్లలో మొక్కజొన్న,583 హెక్టార్లలో మినుము,854 హెక్టార్లలో వేరుశెనగ, పంట నష్టం జరిగినట్లు అంచనా వేసిన అధికారులు

విశాఖ: 
►విశాఖ రూరల్ అత్యధికంగా 51.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
►ఆనంద పురంలో 37.2 మిల్లీ మీటర్ల వర్షపాతం
►భీమిలి లో 44.2 మిల్లీ మీటర్ల వర్షపాతం
►పద్మనాభం 35.2 మిల్లీ మీటర్ల వర్షపాతం
►సితమ్మధర 44.6 మిల్లీ మీటర్ల వర్షపాతం
►పెందుర్తి 35.8 మిల్లీ మీటర్ల వర్షపాతం
► గాజువాక 44.6 మిల్లీ మీటర్ల వర్షపాతం
►గోపాలపట్నం 46.8 మిల్లీ మీటర్ల వర్షపాతం
► ములగడ 49.2 మిల్లీ మీటర్ల వర్షపాతం

గుంటూరు:
► తెనాలి మండలం ఖాజీపేట, కొలకలూరు లో మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించిన జిల్లా వ్యవసాయాధికారి నున్న. వెంకటేశ్వర్లు.

గుంటూరు జిల్లా:
►ప్రత్తిపాడులో పొంగుతున్న ప్రత్తిపాడు-గొట్టిపాడు మధ్యనున్న లోలెవల్ చప్టా వద్ద పోలీసుల పహారా

►ప్రజలు, ప్రయాణీకుల భద్రత దృష్ట్యా రాకపోకలు నిలిపివేసిన ఎస్ఐ రవీంద్ర బాబు

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:

►మిచౌంగ్ తుఫాను ప్రభావంతో కురుస్తూన్న భారీ వర్షాలకు
►కోనసీమ ముఖద్వారం రావులపాలెం ఆర్‌టీసీ  బస్సు స్టాండ్ నీటమునక
►బస్సు రాకపోకలకు అంతరాయం

కాకినాడ జిల్లా
►మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరంలో కోత గురయిన ప్రాంతాలను సందర్శించిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు 
►ఉప్పాడ,మాయపట్నం,సుబ్బంపేటలో బైక్ మీద తిరుగుతూ తుఫాన్ సహయక చర్యలు పరిశీలించిన ఎమ్మెల్యే దొరబాబు

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:
►మిచౌంగ్ తుఫాను ప్రభావంతో కురుస్తూన్న భారీ వర్షాలకు
►కోనసీమ ముఖద్వారం రావులపాలెం ఆర్ టి సి  బస్సు స్టాండ్ నీటమునక
► బస్సు రాకపోకలకు అంతరాయం

► బాపట్ల దగ్గర కొనసాగుతున్న మిచౌంగ్‌ తుపాను ల్యాండ్‌ఫాల్‌ ప్రక్రియ
మరో మూడు గంటల్లో పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా
►తీరం వెంబడి గంటకు 100-120కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు

► మరో రెండు గంటల్లో మిచౌంగ్‌ తుపాను తీరం దాటనుండగా.. తుపాను తీవ్రత నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది.

తీరాన్ని తాకిన మిచౌంగ్ తుపాను: డా. బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్  డైరెక్టర్, విపత్తుల సంస్థ.
►మరో రెండు గంటల్లో  పూర్తిగా తీరాన్ని దాటనుంది 
►తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు
►తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
►ఈరోజు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు,
►పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు.
►అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం 

నెల్లూరు జిల్లా:
►మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటన
►గొలగమూడి,అనికేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించి,బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి
►బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, బాధితులకు దుప్పట్లు, ఆహారం అందజేసిన మంత్రి
►కనుపూరు చెరువు ఆయుకట్టను జిల్లా కలెక్టర్ హరి నారాయణ్‌తో కలిసి పరిశీలించిన మంత్రి కాకాణి.

తాడేపల్లి: మిచౌంగ్‌ తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంళవారం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ అయ్యారు.

తుపాను పరిస్థితులపై ఆరా:
► నెల్లూరు –కావలి మధ్య సగం ల్యాండ్‌ ఫాల్, సగం సముద్రంలో తుపాను గమనం ఉందని తెలిపిన  అధికారులు
► చీరాల, బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు
► తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందన్న అధికారులు​​​​​​
► తిరుపతి, నెల్లూరు జిల్లాలో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని వెల్లడి
► ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తంగా చేశామని చెప్పిన అధికారులు
► ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9500 మందిని తరలించినట్టు వెల్లడి

సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..
►బాధితులకు మంచి సదుపాయాలు అందించాలి.
►సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూడాలి.
►నెల్లూరు, తిరుపతి సహా తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి.
►మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలి.
►తుపాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్‌ కూడా ప్రారంభం కావాలి.
►గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్ధలను వాడుకుని రేషన్‌ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారును ఆదేశించారు.

తుపాను ఎఫెక్టుపై వైసీపి కేంద్ర కార్యాలయం సమీక్ష
► తీర ప్రాంత ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్
► ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించాం: కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జి కేళ్ల అప్పిరెడ్డి 
► బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపులో  నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు
► ట్రాక్టర్లు, ఆటోలలో బాధితులను తరలిస్తారు
► ఇల్లు ఖాళీ చేయాల్సిన సమయంలోనూ సహకరిస్తారు
► ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం తమ ధర్మం
► రైతులు ఎవరూ భయపడాల్సిన పనిలేదు
► తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు
► వర్షాలు తగ్గగానే పంటనష్టం అంచనాలు వేస్తారు

తిరుమలలో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి జలాశయాల పరిశీలన.
► నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారిన జలాశయాలు.
► తిరుమలలో ఉన్న ఐదు జలాశయాలు ఫుల్
► పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం డ్యామ్ లలో నీటి నిల్వాలను అధికారులు అడిగి సమాచారం తీసుకున్న టీటీడీ చైర్మన్‌
► పాప వినాశనం ,గోగర్భం డ్యామ్ లు గెట్లు ఎత్తిన అధికారులు.
► 23న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం హోమం మొదలైన రోజు నుంచి వర్షం కురుస్తుంది
► రెండు రోజులుగా 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
► తిరుమలలో అన్ని జలాశయాలు నిండాయి
► ఒకటిన్నర సంవత్సరానికి సరిపడా నీరు చేరింది
► తిరుపతి భూగర్భ నీటిశాతం పెరిగింది
► శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం హోమం ద్వారానే వర్షాలు కురిశాయి.

తీరానికి చేరువలో మిచౌంగ్‌ తుపాను: విశాఖ వాతావరణం కేంద్రం డైరెక్టర్ సునంద
►  మరి కాసేపట్లో బాపట్ల వద్ద తీరాన్ని దాటే అవకాశం
►  తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు
►  మచిలీపట్నం నిజాంపట్నం పోర్టులో పదో నంబరు ప్రమాద సూచిక కాకినాడలో తొమ్మిదో నెంబర్ ప్రమాద సూచిక ఎగురువేత
►  తీరం దాటిన తర్వాత తుఫానుగా ఉత్తర దిశలో పయనించనున్న తుపాను
►  తుపాను ప్రభావంతో ఉత్తరకొస్తా జిల్లాలో ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు
►  తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు
► తుపాను ప్రభావంతో ఒడిశా, చత్తీస్‌గఢ్‌ తెలంగాణ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు

ఉయ్యూరు మండలం గండిగుంట ఆర్బికే కేంద్రాన్ని పరిశీలించిన సివిల్ సప్లై కమిషనర్ అరుణ్ కుమార్
► తుఫాను వలన రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నాం: అరుణ్ కుమార్
► రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం
► ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
► రవాణ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నాం
► రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దు
► సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు

► రాష్ట్రంలో మిచౌంగ్‌ తుపాను ప్రభావంపై అప్రమత్తంగా ఉన్నాం: ఏపీ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి
► ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
► నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయి.
► రాష్ట్రంలో ని అన్ని ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదు అవుతోంది
► 8 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను పంపాము
► రేపు సాయంత్రం వరకు వర్షాలు కురుస్తాయి
► 22 కోట్లు తక్షణ చర్యలు కోసం విడుదల చేశాం
► లక్ష టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం
► 4 లక్షల టన్నుల ధాన్యాన్ని తడవకుండా చర్యలు తీసుకున్నాం
► 11 వేల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు
► అందరికి ఆహారం, నిత్యావసరాలు, ఆర్థిక సహాయం అందిస్తున్నాం
► తుపాను ప్రభావంతో కలిగే నష్టాన్ని వెంటనే అంచనా వేసి కేంద్రానికి పంపిస్తాం
► వర్షాలు అధికంగా ఉన్న చోట పాఠశాలలకు సెలవు ప్రకటించాం
► ఇప్పటివరకు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం

కృష్ణాజిల్లా : 
► కృత్తివెన్ను మండలం పీతలావ, వర్లగొంది తిప్ప గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు.
► పునరావాస కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు  చేసిన అధికారులు.
► నిడమర్రు, చిన్న గొల్లపాలెం, పడతడిక, ఇంతేరు సముద్ర తీరం వెంబడి 75 మంది అదనపు పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు జిల్లా ఎస్పీ జాషువా.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:
► రాజోలు నియోజకవర్గంలో భారీ వర్షంతో నేలకు ఒరిగిన చేతికి అంది వచ్చిన వరిచేలు.
► శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఈ తుపాను కారణంగా చేతికి అందకుండా పోయిందని రైతుల ఆవేదన.
► ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్న రైతులు.
 

తిరుపతి:
►మిచౌంగ్ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భక్తుల భద్రతా దృష్ట్యా తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో ఆంక్షలు విధించారు. వర్షాల కారణంగా రెండు ఘాట్ రోడ్లలో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో వాహన రాకపోకులకు అంతరాయం కలుగుతోంది.
►అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులు ముందున్న వాహనాలు సరిగా కనపడక ఇబ్బందులకు గురవుతున్నారు. తద్వారా వాహనాలు, ప్రయాణికులు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. 
► ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గి సాధారణ స్థితి వచ్చేంత వరకు రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుండి సాయంత్రం 8 వరకు మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకున్నారు.

 వరద సృష్టించిన విధ్వంసం(ఫోటోలు)

బాపట్ల జిల్లా:
►చీరాలలో 10 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.
►మిచౌంగ్ తుపాను ప్రభావంతో చీరాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం.
►తీరప్రాంతంలోని 25 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు.
►విపత్తును ఎదుర్కొనేందుకు 16 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధం చేసిన అధికారులు.
►మిచౌంగ్ తుపాను కారణంగా చీరాల తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు.

మిచౌంగ్ తుపాను ప్రభావంతో మరో మూడు రైళ్లు రద్దు.
►గూడూరు-రేణిగుంట, రేణిగుంట-గూడూరు, తిరుపతి-పుల్ల రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.
►హౌరా కన్యాకుమారి రైలు దారి మళ్లింపు.

తిరుపతి
► వరద బాధితులకు అండగా నిలుస్తూ అవసరమైన ఏర్పాట్లను చేపడుతున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి.
► అప్రమత్తంగా ఉండాలని, ఏ అవసరమొచ్చిన తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించిన  భూమన.
► పూలవాని గుంట, గొల్లవాని గుంట ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించిన భూమన.
► పునరావాస కేంద్రాలకు తరలించిన వారితో పాటు అవసరమైన ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు రాలేని పరిస్థితి ఉన్నా సరే అలాంటి వారికి  ఆహార పానియాలను అందజేయాలని తహశీల్దార్ వెంకట రమణను ఆదేశించిన భూమన.

రైళ్ల రాకపోకలపై తుపాను ఎఫెక్ట్‌ 
►హైదరాబాద్‌ నుంచి దక్షిణాదికి నిలిచిన రైళ్లు 
►ఉత్తరాది నుంచి వచ్చే వాటికీ బ్రేక్‌ 
►ఇప్పటికే 150కిపైగా రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే 
►వివరాల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు 
►తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని రైల్వే అధికారులకు జీఎం ఆదేశాలు 
►అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచనలు

కాకినాడ జిల్లా
పెద్దాపురం:మీచాంగ్ తూపాన్ నేపథ్యంలో సామర్లకోట మండలంలో 4000 వేలమంది రైతుల వద్ద నుండి ఆన్‌లైన్‌లో  17,450, ఆఫ్ లైన్‌లో 1504 మెట్రిక్ టన్నుల ధాన్యం.
►పెద్దాపురం మండలంలో 832 మంది రైతుల వద్ద నుండి ఆన్‌లైన్‌లో 4303, ఆఫ్‌లైన్‌లో  369 మెట్రిక్ టన్నుల  ధాన్యం కొనుగోలు చేసిన వ్యవసాయ అధికారులు.
►రెండు మండలాల్లో 80 శాతం పూర్తైన వరి కోతలు.

నెల్లూరు జిల్లా: బంగాలఖాతంలో ఏర్పడ్డ తుపాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద.
►ఇన్ ప్లో 10,915 క్యూసిక్కులు,అవుట్ ప్లొ 70 క్యూసెక్కులు.
►ప్రస్తుత జలాశయం సామర్థ్యం 30.756 టీఎంసీలు.

మిచౌంగ్  తుపాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం

  • పశ్చిమగోదావరి జిల్లాకు  రెడ్ ఎలర్ట్, ఏలూరు జిల్లాకు ఆరెంజ్ ఎలర్ట్ ప్రకటన 
  • తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు
  • నర్సాపురం, మొగల్తూరు రెండు మండలాల్లో 12 తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు గుర్తింపు
  • పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు
  • భీమవరం  కలెక్టర్ కార్యాలయంలో 'మిచాంగ్' తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
  • అత్యవస సహాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 08816 299219...
  • విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన అధికారులు
  • ఎన్ డి ఆర్ ఎఫ్ ,ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచిన అధికారులు
  •  జిల్లాలో 1. 40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు

ముమ్మరంగా తుపాను సహాయచర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం

  • జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం
  • రాష్ట్రంలో తుపాను ప్రభావిత జిల్లాల్లో పటిష్టమైన చర్యలు చేపట్టిన ప్రభుత్వం
  • బాపట్ల, కోనసమీ, తూర్పుగోదావరి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం
  • పలు జిల్లాల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షపాతం నమోదు
  • కోనసీమలో86, క్రిష్నా జిల్లాలో 55, బాపట్ల జిల్లాలో 64, నెల్లూరు జిల్లాలో 55, చిత్తూరు జిల్లాలో 93 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
  • గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలు. 10 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు
  • తిరుపతి జిల్లా కోటలో అత్యధికంగా 388 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
  • మనుబోలు లో 366,  చిల్లకూరు లో 350, నాయుడు పేటలో 271, బలయపల్లిలో 239, సైదాపురంలో 223, వెంకటాచలంలో 213 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

తిరుపతి జిల్లా

  • ఏర్పేడు మండలంలో సున్నపువాగులో చిక్కుకున్న బండారు పల్లెకు చెందిన శివ, వెంకటేష్ 
  • నిన్న సాయంత్రం సున్నపు వాగు ఉదృతి పెరగడం తో మధ్యలో నిలిచిపోయిన వ్యవసాయ కూలీలు
  • రక్షించే ప్రయత్నం చేస్తున్న రెవెన్యూ అధికారులు, ఫైర్ అధికారులు
     

కాకినాడ: 

  • మిచాంగ్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలు
  • తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు
  • కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేసిన పోలీసులు
  • ఇవాళ కూడా పాఠశాలలకు శెలవు ప్రకటించిన అధికారులు
  • కాకినాడ పోర్టులో ఎగుమతులు, దిగుమతులకు ఆటంకం
  • వేటను నిలిపివేసి తీరానికే పరిమితమైన గంగపుత్రులు
  • ఉప్పాడలో తుపాను  పునరావాస కేంద్ర ఏర్పాటు
  • భారీ వర్షాలకు 3 వేల ఎకారాల్లో నేల కొరిగిన వరి పంట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

  • పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్: 
  • ప్రస్తుతానికి నెల్లూరుకు 50 కి.మీ, బాపట్లకు 110 కి.మీ, మచిలీపట్నానికి 170కి.మీ. దూరంలో తుపాను
  • మధ్యాహ్ననంలోపు నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్
  • తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు

మిచౌంగ్ తుపాను కారణంగా విశాఖలో బీచ్‌లు మూసివేత

  • ఆర్కే బీచ్‌లో పోలీసుల ప్రత్యేక పెట్రోలింగ్
  • అన్ని బీచ్‌ల వద్ద పోలీసుల పర్యవేక్షణ
  • పర్యాటకులు బీచ్‌లోకి దిగకుండా ఆంక్షలు

చెన్నైలో జలప్రళయం 

  • ముంచెత్తిన మిచౌంగ్‌ తుపాను
  • ఏకంగా 35 సెంటీమీటర్ల వాన
  • పూర్తిగా స్తంభించిన జనజీవనం
  •  వరదలకు కొట్టుకుపోయిన పార్కింగ్‌ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు
  • నడుం లోతుకు పైగా నీరు చేరడంతో నగరంలోని అన్ని హైవేలను, సబ్‌వేలను మూసేశారు.
  • రన్‌ వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయం కూడా మూసివేత
  • హైవేలు, సబ్‌వేల మూసివేత
  • నీట మునిగిన విమానాశ్రయం
  • 160 విమానాలు రద్దు
  • నేడు మరింత వర్ష సూచన!

తూర్పుగోదావరి జిల్లా: 

  • రాజమండ్రి నగరంలో నిలిచిపోయిన వర్షం.. స్తబ్దంగా ఉన్న వాతావరణం
  • ఏజెన్సీ ప్రాంతంలో తుఫాను ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న వర్షం
  • ముందస్తు చర్యగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 30 పురావస కేంద్రాల ఏర్పాటు
  • ఇవాళ తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల పరిధిలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు
  • సముద్ర తీర ప్రాంతంలోకి మత్స్యకారులు గాని, పిక్నిక్ల పేరిట సాధారణ జనం కానీ వెళ్ళద్దని హెచ్చరికలు
  • గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు పూర్తి చేసి, ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రైతులకు సహాయపడుతున్న అధికారులు
  • తీర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు సిబ్బందిని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగం
  • రాజమండ్రి కలెక్టరేట్, రాజమండ్రి ,కొవ్వూరు ఆర్డీవో కార్యాలయాల్లోను, అమలాపురం కలెక్టరేట్లోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

తిరుపతి:

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను, అధికారులను అప్రమత్తం చేశాం: భూమన

  • గత అనుభవాల దృష్ట్యా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం జరిగింది.
  • ముందుస్తుగా వరద  కాలువల్లో పూడిక తీయడం వంటి చర్యలు చేపట్టం జరిగింది
  • దీని వల్ల మరీ లోతట్టు ప్రాంతాల్లో మినహా వరద నీటి ఉదృతి చాలా వరకు తగ్గింది
  • తిరుమలలో కూడా జలాశయాన్ని పూర్తిగా నిండాయి
  • ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను  ఆదేశించడం జరిగింది

కృష్ణాజిల్లా:

  • మచిలీపట్నం హార్బర్ లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేత
  • తీరప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షం

తుపానుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

  • పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్
  • ప్రస్తుతానికి చెన్నైకి 170 కి.మీ, నెల్లూరుకు 20 కి.మీ, బాపట్లకు 150 కి.మీ, మచిలీపట్నానికి 210కి.మీ. దూరంలో తుపాను
  • మధ్యాహ్ననికి  నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్
  • తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు
  • కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు,
  •  పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, 
  • అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం 
  • రేపు రాయలసీమల, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు నమోదైయ్యే అవకాశం 
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

4 జిల్లాల్లో కుండపోత వర్షాలు

  • తీవ్ర రూపం దాల్చిన తుపాను.. 4 జిల్లాల్లో కుండపోత వర్షాలు
  • తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వాన
  • పలు చోట్ల 15–20 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షం.. అత్యధికంగా బుచ్చినాయుడు కండ్రిగలో 28 సెంటీమీటర్లు

  • కృష్ణపట్నం పోర్టులో 10వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ.. పొంగుతున్న వాగులు, వంకలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం 
  • బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ మొదలైన వానలు.. నేటి మధ్యాహ్నం చీరాల, బాపట్ల మధ్యలో తీరం దాటే అవకాశం
  • ఉప్పాడ తీరంలో గ్రామాల్లోకి చొచ్చుకొచ్చిన సముద్రపు నీరు.. నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం

  • బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుపాను సోమవారం తీవ్ర రూపం దాల్చింది.
  •  గంటకు పది కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రకు సమాంతరంగా కదులుతుండడంతో తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 
  • ఉమ్మడి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాల్లో కురు­స్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రాంతాలు జల­మ­య­మయ్యాయి. 
  • తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో 28.3 సెంటీ­మీ­టర్ల వర్షం కురిసింది. 

  • తిరు­పతి జిల్లా పెళ్లకూ­రులో 23.1, దొరవారిసత్రంలో 26.4, నాయుడుపేట 21, సూళ్లూరుపేట 20.3, నెల్లూరు 24.3, ఇందుకూరుపేటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 
  • ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది.
  • నేడు, రేపు భారీ వర్షాలు
  • మిచౌంగ్‌ తుపాను తీవ్రరూపం దాలుస్తూ కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. 
  • గుంటూరు జిల్లా రేపల్లె, ప్రకాశం జిల్లా చీరాల, ఒంగోలు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటల్లో సముద్రం 120 నుంచి 250 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకు వచ్చే అవకాశం 
  • ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఐఎండీ సూచన
  •  తుపాను ప్రభావం వల్ల మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి
  • పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, 
  • ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది.
  • ఫలితంగా తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, యానాం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం. తెలంగాణలోని ఖమ్మం, నాగర్‌ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరదకు అవకాశం ఉంది
>
మరిన్ని వార్తలు