జగన్‌ ప్రభుత్వం నిర్ణయం.. ఎన్నాళ్లకెన్నాళ్లకో వేచిన ఉదయం

20 Jun, 2022 08:39 IST|Sakshi

పాతపట్నం: నలిగిపోయి, మాసిపోయిన షర్ట్‌.. ప్యాంటో లేక షార్టో తెలి యని బాటమ్‌.. పాత సైకిల్‌పై ఓ సంచిలో బనియన్లు, డ్రాయర్లు, చొక్కాలు పెట్టుకుని.. పాతపట్నం, కొరసవాడ, కాగువాడ గ్రామాల్లో అమ్ముతూ  జీవిస్తున్నాడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు. బేరం లేని రోజు పస్తు పడుకోవడం తప్ప మరో దారి లేని ఇతను ఇలా రెండు దశాబ్దాలుగా జీవితం లాక్కొస్తున్నాడు. 

అరకొర ఆదాయం వల్ల పెళ్లి కూడా చేసుకోలేదు. తల్లిదండ్రులు అల్లక నీలకంఠు, అమ్మయమ్మలు మృతి చెందారు. ఎంఏ, బీఈడీ చదివి, ఇంగ్లిష్‌ అనర్గ ళంగా మాట్లాడే ఇతను 1998 బ్యాచ్‌ డీఎస్సీకి అర్హత సాధించారు. అయితే వివిధ కారణాల వల్ల అప్పట్లో ఉద్యోగం రాలేదు. తాజాగా జగన్‌ ప్రభుత్వం నిర్ణయంతో ఆ బ్యాచ్‌లో మిగిలి పోయిన అర్హులకు ఉద్యోగాలొచ్చాయి. ఈ విష యాన్ని గ్రామస్తులు కేదారేశ్వరరావు చెవిన వేయగా, ఆయన ఆశ్చర్యపోయాడు. చంద్ర బాబు ఇవ్వలేదు.. జగన్‌ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇతని వయసు 57 ఏళ్లు. ఈ వయసులో ఇతని జీవితం ఇలా మేలి మలుపు తిరగడం పట్ల స్థానికులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు