అక్షరక్షరంలో పైత్యం నిండిన రాతలు.. మీ బాబూ మళ్లించారు రామోజీ!

25 Jan, 2023 07:23 IST|Sakshi

2019 జూన్‌ ముందు నుంచే అనేక పథకాలకు ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు

ఈనాడుకు అవే అంశాలు అప్పుడు ఒప్పుగా నేడు తప్పుగా కనిపిస్తున్నాయి

సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో అన్నీ చక్కగా భేషుగ్గా అనిపించినవి ఇప్పుడు జగన్‌ పా­లన­లో అవే అంశాలు బాబు రాజగురువు రామో­జీరావుకు పెద్ద తప్పుగా అనిపిస్తున్నాయి. బాబు చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అన్నట్లుగా ఉన్నాయి ఆయన రాతలు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి ‘పేరుకే చట్టం.. ఎన్నేళ్లున్నా.. ఏం లాభం?’ శీర్షికతో గుండెలు బాదుకున్న రామోజీ.. బాబు బాగోతాన్ని దాచేసి ఆ కథనంలో ప్రస్తుత ప్రభుత్వంపై తన పైత్యాన్ని అక్షరక్షరంలో నింపారు. 

బాబు పథకాలకూ ఎస్సీ కాంపొనెంట్‌ నిధులు
చంద్రబాబు పాలనలోనే అనేక పథకాలకు ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్‌ నిధులు ఖర్చుచేశారు. అప్పట్లో అనేక పథకాలకు ఎస్సీ కాంపొనెంట్‌ నిధులను కేటాయించారు. నాటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు 2018 మార్చిలో అసెంబ్లీలో ప్రవేశ­పెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదనలను పరిశీలిస్తే ఈ విష­యం తేటతెల్లమవుతుంది.

ఉదా.. సామా­జిక పెన్షన్ల­లో భాగంగా దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు ఎన్టీఆర్‌ పెన్షన్‌ స్కీమ్, పొలంబడి, పొలంబడి–చంద్రన్న రైతు క్షేత్రాలు, జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్లలో మెంటార్లకు ఇచ్చే గౌరవ వేతనాలు, మధ్యా­హ్న భోజన పథకం (పౌష్టికాహారం), పిల్లలు, తల్లు­లకు ప్రత్యేక పోషకాహారం, అన్న అమృతహస్తం, డ్వాక్రా మహిళలకు శానిటరీ నాప్‌కిన్స్, ఎన్టీఆర్‌ జలసిరి, ఎన్టీఆర్‌ సుజల స్రవంతి, చంద్రన్న పెళ్లికానుక, ఎన్టీఆర్‌ విద్యావసతి స్కీమ్, మా ఇంటి మహాలక్ష్మి వంటి అనేక పథకా­లకు ఎస్సీ కాంపొనెంట్‌ (ఉప ప్రణాళిక) నిధులను కేటాయించారు. కానీ, ఈ వాస్తవాలను వక్రీకరించి అల్లిన కథనం వెనుక రామోజీకి ఉన్న ఉద్దేశాలు జగమెరిగినవే. 

జగన్‌ పాలనలోనే ఎక్కువ మేలు..
ఇక చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్‌కు ఖర్చుచేసిన నిధులకు మించి ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలోనే ఖర్చుచేసిందన్నది గణాంకాలే చెబుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకు ఐదేళ్ల కాలంలో ఎస్సీ ఉప ప్రణాళిక కోసం రూ.33,625.49 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019–20 నుంచి 2022 డిసెంబర్‌ వరకు మూడున్నరేళ్ల కాలంలో రికార్డు స్థాయిలో రూ.48,899.66 కోట్లు ఖర్చుచేసింది.
చదవండి: ఎందుకీ గగ్గోలు?.. ఇప్పుడు ఎవరి ఇల్లు తగలబడుతోంది?

అంటే ఐదేళ్లలో టీడీపీ సర్కార్‌ కేటాయించిన మొత్తానికంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.15,274.17 కోట్లు అదనంగా కేటాయించడం రికార్డు. ఎస్టీల కోసం చేసిన ఖర్చుచూస్తే.. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12,487.48 కోట్లు ఖర్చు­చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం మూడున్నరేళ్లలో రూ.­15,589.38 కోట్లు ఖర్చుచేసింది. అంటే గత ప్రభు­త్వం ఐదేళ్లలో కేటాయించిన మొత్తంకంటే వైఎ­స్సార్‌సీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో రూ.­3,101.9 కోట్లు అదనంగా ఖర్చుచేసింది. కానీ, ఇవేమి పరిగణనలోకి తీసుకోని ఈనాడు నిధుల కోత అంటూ వక్రీకరించి గుండెలు బాదుకుంటోంది. బాబు హయాంలో నిధుల మళ్లింపు అంశాన్ని మరు­గునబెట్టి ప్రస్తుత ప్రభుత్వంపై బురదజల్లుతోంది.

మరిన్ని వార్తలు :

Advertisement
మరిన్ని వార్తలు