తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

4 Nov, 2023 08:01 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి నేరుగా భక్తుల్ని అనుమతిస్తున్నారు. దీంతో ఎనిమిది గంటల్లోనే సర్వదర్శనం ముగుస్తోంది. 

ఇక శుక్రవారం 66,048 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు 24,666 మంది సమర్పించగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.25 కోట్లుగా తేలింది.

మరోవైపు డిసెంబర్‌ 23–జనవరి1 వర­కు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను (రోజు­కు 2 వేల టికెట్లు) నవంబర్‌ 10న ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. తిరుపతిలోని 9 కేంద్రాల్లో 100 కౌంటర్లలో డిసెంబర్‌ 22న వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజులకుగాను 4.25 లక్షల టైం స్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఆలయ ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. అలాగే.. నవంబర్‌ 12న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని, 24న చక్రతీర్థ ముక్కోటి నిర్వహిస్తామన్నారాయన.

మరిన్ని వార్తలు