‘మార్కెట్‌’లో సౌందర్యలహరి

5 Apr, 2023 05:10 IST|Sakshi

విస్తరిస్తున్న సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ 

ప్రపంచ బ్యూటీ ఉత్పత్తుల వినియోగంలో భారత్‌ 7వ స్థానం

అందానికి దాసోహమవని వారు ప్రపంచంలో ఉంటారా? సౌందర్యారాధన లేని వారు ఉంటారా? అందుకే సౌందర్య ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ పెరుగుతోంది. పట్టణాల్లోనే కాదు గ్రామాల్లోనూ బ్యూటీ పార్లర్లు, స్టైలిష్‌ హబ్‌లు వెలుస్తున్నాయి. ఫేస్‌వా ష్లు, మాయిశ్చరైజర్ల నుంచి కంటి క్రీమ్‌లు, ఫేస్‌ మాస్‌్కలు, సన్‌స్క్రీన్‌ లోషన్‌తో అన్నింటినీ మహిళలు, పురుషులు, పిల్లల కోసం కంపెనీలు ప్రత్యేకంగా తయారు చేస్తున్నాయి.

2018లో ప్రపంచ వ్యాప్తంగా సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ 134.8 బిలియన్‌ డాలర్లు ఉంటే, 2021 నాటికి 532 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 2024 నాటికి 893 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని జియాన్‌ మార్కెట్‌ రీసెర్చ్‌(జీఎంఆర్‌) విభాగం అంచనా వేసింది. 2020 నుంచి భారతదేశంలో ప్రీమియం సౌందర్య ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతున్నట్టు గుర్తించింది.

ప్రస్తుతం చర్మ, సౌందర్య ఉత్పత్తుల వినియోగంలో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. వచ్చే ఐదేళ్లలో పురుషుల సౌందర్య, గ్రూమింగ్‌ ఉత్పత్తులు కూడా భారీగా పెరుగుతాయని, దాంతో యునిసెక్స్‌ ఉత్పత్తుల తయారీ విస్తరిస్తుందని జీఎంఆర్‌ అంచనా వేసింది. 

చర్మ సౌందర్య ఉత్పత్తులే అధికం 
2021లో మొత్తం సౌందర్య ఉత్పత్తుల కొనుగోళ్లలో 148.3 బిలియన్‌ డాలర్లు కేవలం చర్మ రక్షణ ఉత్పత్తులదే.  
 పర్సనల్‌ కేర్‌ మార్కెట్‌లో 42 శాతం స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులే ఉన్నాయి. తర్వాత స్థానంలో హెయిర్‌ కేర్‌ 22 శాతం, బ్యూటీ అండ్‌ మేకప్‌ కేర్‌ 16 శాతం ఉన్నాయి.  
 ప్రపంచ బ్యూటీ ఉత్పత్తుల మార్కెట్‌లో ప్ర­స్తుతం 7వ స్థానంలో ఉన్న భారత్‌.. వచ్చే మూ­డేళ్లలో 4వ స్థానానికి చేరుతుందని అంచనా.  
సర్వే ప్రకారం భారత్‌లో సహజ సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ 2022లో 15 బిలియన్‌ డాలర్లు ఉండగా, 2024 నాటికి 22 బిలియన్ల డాలర్లకు, 2028 నాటికి 38 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని జీఎంఆర్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు