జగన్‌ పాలనతోనే విద్యార్థులకు ‘ఉన్నత’ చదువులు 

5 Dec, 2023 05:25 IST|Sakshi

వైఎస్సార్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య

కడపలో విద్యార్థుల భారీ ర్యాలీ

కడప కార్పొరేషన్‌: విద్యా రంగంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన సంస్కరణలు, పథకాలతో విద్యార్థులకు ‘ఉన్నతమైన’ విద్య అందుబాటులోకి వచ్చిందని వైఎస్సార్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌(వైఎస్సార్‌ఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు పి.సాయిదత్త అన్నారు. నాలుగున్నరేళ్లలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం కడపలో వైఎస్సార్‌ఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.

కోటిరెడ్డి సర్కిల్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ.. ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్, సంధ్యా సర్కిల్‌ మీదుగా తిరిగి కోటిరెడ్డి సర్కిల్‌కు చేరింది. ఈ సందర్భంగా చైతన్య, సాయిదత్త మాట్లాడుతూ.. విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారని వివరించారు. ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దారని చెప్పారు.

అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ విద్యా భోధన, టోఫెల్‌ శిక్షణ తదితర కార్యక్రమాలను ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను చేరువ చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ఎస్‌యూ నగర అధ్యక్షుడు సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు