ఆ పాపాలు ఎవరివంటే..?

5 Jul, 2021 09:46 IST|Sakshi

భామిని: వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వా రా పిల్లలు, బాలింతలకు పంపిణీ చేయాల్సిన ఐసీడీఎస్‌ పాలు ఆక్రమ రవాణా కేసులో ఇద్దరిని అరె స్టు చేశామని, మరో ముగ్గురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. అరెస్టయిన వారిలో వ్యాన్‌ యజమాని, డ్రైవర్‌ ఉన్నట్టు పేర్కొన్నారు. భామిని మండలం బత్తిలి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై కె.వి.సురేష్‌తో కలిసి పాలు ఆక్రమ రవాణా కేసు వివరాలను ఆది వారం వెల్లడించారు. బత్తిలి పోలీస్‌లు చెక్‌పోస్టు వ ద్ద శనివారం పట్టుకున్న 1919 లీటర్ల పాల అక్రమ రవాణాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పాల ప్యాకెట్లను సరఫరా చేసే సబ్‌డీలర్లే కార్యకర్తల వద్ద కొనుగోలు చేసి  అ క్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు.

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని భద్రగిరి ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధి నుంచి పాల ప్యా కెట్లు తరలివచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. వీటిని మిఠాయి, టీ షాపులకు విక్రయిస్తున్నారన్నా రు. ప్యాకెట్లపై ఉన్న నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేయగా.. వీరఘట్టం ప్రాజెక్టుకు చెందిన ప్యాకెట్లు కూడా ఉన్నట్టు వివరించారు. వీటి అమ్మకాలపై డి విజన్‌లోని కొన్ని మండలాల్లో  తనిఖీలు నిర్వహించి పలు దుకాణాల్లో ఇవే రకం పాలు ప్యాకెట్లు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. సీజ్‌ చేసిన ప్యాకెట్లను ఐసీడీఎస్‌ పీడీకి అప్పగించామన్నారు.  

మరిన్ని వార్తలు