విశాఖ తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరిన ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌

3 Jun, 2021 21:23 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని తూర్పు నౌకాదళ కేంద్రానికి ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ నౌక గురువారం ఆక్సిజన్‌, కోవిడ్‌ మందులతో చేరుకుంది. కాగా ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ సింగపూర్‌ , వియత్నాం నుంచి 158 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌, 2722 ఆక్సిజన్‌ సిలిండర్లను తీసుకొచ్చింది. సముద్ర సేతు ప్రాజెక్టులో భాగంగా సింగపూర్‌, వియత్నాం భారత్‌కు కోవిడ్‌ సామాగ్రిని అందించింది. ఇప్పటికే సింగపూర్‌, ఇతర మిత్ర దేశాలు రెండు సార్లు కోవిడ్‌ సామాగ్రిని అందించాయి. కాగా తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరుకున్న సామాగ్రిని సిబ్బంది ఏపీతో పాటు ఇతర ప్రాంతాలకు తరలించనున్నారు.

మరిన్ని వార్తలు