కంటిపాపకు మృత్యు‘కాటు’క

3 Nov, 2020 11:41 IST|Sakshi

ఏడాది నిండే వేళ నిండిన నూరేళ్లు

కాటుక డబ్బా గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి 

కన్నవారి కంటిపాపకు.. ఇంటిని వెలిగించే చంటిపాపకు ఆ దేవుని చల్లని చూపులే శ్రీరామరక్ష. కానీ కంటిని కాపాడాల్సిన కాటుక కాలకూట విషమై విషాదాన్ని కుమ్మరిస్తే.. చంటిపాపను చల్లగా చూడాల్సిన దైవం ఉదాసీనతతో ఉపేక్షిస్తే.. ఎంతో ఘోరం జరిగిపోతుంది! చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది! కొద్దిగంటల వ్యవధిలో మొదటి పుట్టిన రోజు జరుపుకోబోతున్న ఆ పసివాడి జీవితంలో అదే జరిగింది. ఏడాది నిండబోతున్న ఆనందకర తరుణంలో ఆ బుజ్జాయికి నూరేళ్లూ నిండడంతో కుటుంబం కంటికీ.. మింటికీ ఏకధారగా విలపిస్తోంది.    

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మండలం రత్తకన్న  గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. చిన్న కాటుక డబ్బాను మింగేసిన రిహాన్స్‌ దొళాయి అనే చిన్నారి ఊపిరాడక మృతి చెందాడు. నవంబర్‌ 4 చిన్నారి పుట్టిన రోజు కావడం గమనార్హం. రత్తకన్న గ్రామంలోని ఒడియా వీధికి చెందిన గీత బిసాయి, కంచిలి మండలం కొక్కిలి పుట్టుగ గ్రామానికి చెందిన కుమార్‌ దొళాయిలకు మూడేళ్ల క్రితం వివాహమైంది. గత ఏడాది నవంబర్‌ 4న వీరికి రిహాన్స్‌ దొళాయి జన్మించాడు. మరో రెండు రోజుల్లో బాబు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం కుమారుడికి కొత్తబట్టలు తొడిగిన తల్లి.. మందు గదిలో ఉంచి.. దేవుడికి నమస్కరించేందుకు తరువాత గదిలోకి వెళ్లింది. బాబు ఆడుకుంటూ దగ్గరలో ఉన్న కాటుక డబ్బాను మింగేశాడు. నోటి నుంచి రక్తరావడంతో కుటుంబ సభ్యులు భయపడ్డారు. గొంతులో ఏదో ఉండిపోయిందని గ్రహించి బయటకు తీయడానికి ప్రయతి్నంచారు. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. (చదవండి: ప్రియుడితో రాసలీలలు.. భర్త రెడ్‌హ్యాండెడ్‌గా..)  

మరిన్ని వార్తలు