తైవాన్‌ అమ్మాయి.. తెలుగింటి అబ్బాయి

5 Sep, 2023 11:03 IST|Sakshi
సాయి దినకర్, యూటింగ్‌ లియూ వివాహ రిసెప్షన్‌లో సంప్రదాయ దుస్తుల్లో తైవాన్‌ దేశీయులు

సాక్షి, చల్లపల్లి(అవనిగడ్డ): ఎల్లలు ఎరుగని ప్రేమతో ఎంతో మంది విదేశీ వనితలు తెలుగింటి అబ్బాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా చల్లపల్లి గ్రామానికి చెందిన వేమూరి సాయిదినకర్, తైవాన్‌ దేశానికి చెందిన యూటింగ్‌ లియూ పెద్దల అనుమతితో ప్రేమ వివాహం చేసుకున్నారు.

చల్లపల్లికి చెందిన మెడికల్‌ షాప్‌ నిర్వాహకుడు వేమూరి కిషోర్‌ కుమారుడు సాయి దినకర్‌ తైవాన్‌  దేశంలోని సించూ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అక్కడే ఫిజియోథెరపిస్ట్‌ యూటింగ్‌ లియూతో ప్రేమలో పడ్డారు. వారిద్దరి వివాహానికి వరుడి తండ్రి కిషోర్, వధువు తండ్రి ఈషెంగ్‌ లియూ అంగీకరించారు.

దీంతో ఈ నెల రెండో తేదీ ద్వారకా తిరుమలలో సాయి దినకర్, యూటింగ్‌ లియూ వివాహం తెలుగు సంప్రదాయంలో వైభవంగా నిర్వహించారు. సోమవారం ఘంటసాల మండలం దేవరకోటలో రిసెప్షన్‌  జరిగింది. ఈ వేడుకకు వధువు యూటింగ్‌ లియూ కుటుంబ సభ్యులు, బంధువులైన తైవాన్‌ దేశస్థులందరూ తెలుగు సంప్రదాయం ప్రకారం మహిళలు పట్టు చీరలు, పురుషులు పట్టు పంచెలు ధరించి ఆకట్టుకున్నారు.
చదవండి: కోనసీమ: పిడుగు పాటుతో కుంగిన భూమి

మరిన్ని వార్తలు