ఛత్తీస్‌గఢ్‌ చిన్నారికి ప్రధాని మోదీ లేఖ

5 Nov, 2023 06:12 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన చిత్రం గీసిన చిన్నారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేకంగా లేఖ రాశారు. గురువారం ప్రధాని మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆకాంక్ష అనే చిన్నారి తన చిత్రం గీసి తీసుకువచ్చింది. ప్రధాని మోదీ ఆ చిన్నారిని గమనించి, వేదికపైకి పిలిపించుకున్నారు. వివరాలడిగి ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. శనివారం చిన్నారి ఆకాంక్షకు ఆయన ఒక లేఖ రాశారు. నేటి బాలికలే దేశ ఉజ్వల భవిత అని పేర్కొన్నారు.

నువ్వు తీసుకువచ్చిన స్కెచ్‌ నాకు చాలా బాగా నచ్చింది. నాపై నువ్వు చూపిన అభిమానం, ప్రేమకు ధన్యవాదాలు. నీకు ఎల్లప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి. భవిష్యత్తులో నువ్వు విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. రాబోయే 25 ఏళ్లు మీలాంటి చిన్నారులకు ముఖ్యమైన రోజులు కానున్నాయి. ఈ కాలంలో ముఖ్యంగా దేశయువతతోపాటు మీలాంటి పుత్రికలు భారత్‌ కలలను నెరవేరుస్తారు. దేశ భవిష్యత్తుకు కొత్త దిశను అందిస్తారు’అని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు