9, 10 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

9 Jul, 2021 04:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి పథకం కింద  ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్యుయెల్‌ కోర్‌ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 ఇంచ్‌ల స్క్రీన్, విండోస్‌ 10 (ఎస్టీఎఫ్‌ మైక్రోసాఫ్ట్‌), ఓపెన్‌ ఆఫీస్‌ (ఎక్సెల్, వర్డ్, పవర్‌ పాయింట్‌)ల కాన్ఫిగరేషన్‌తో ల్యాప్‌టాప్‌లు అందించనుంది.

వీటికి మూడేళ్ల వారెంటీ ఉంటుంది. అమ్మఒడి ఆర్థిక సాయానికి బదులు తమకు ల్యాప్‌టాప్‌లు కావాలని కోరుకునే విద్యార్థులకు వీటిని అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లకు మెయిన్‌టెనెన్స్‌ సమస్యలు ఎదురైతే ఫిర్యాదు ఇచ్చిన వారంలోపు పరిష్కరించేలా సదరు కంపెనీకి షరతు విధిస్తున్నారు. ఫిర్యాదులను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాల్సి ఉంటుంది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు