నేడు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ మెగా డ్రైవ్‌ 

26 Jul, 2021 09:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గాందీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లా వ్యాప్తంగా సోమవారం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ మెగా డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోని గర్భిణులు, బాలింతలు, ఉపాధ్యాయులు, నర్సింగ్, శానిటేషన్‌ సిబ్బంది ఇతర హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌కు వ్యాక్సిన్‌ అందిస్తామన్నారు. మొదటి విడత డోస్‌ తర్వాత నిర్ణీత కాల వ్యవధి పూర్తి చేసుకున్న వారికి రెండో డోస్‌  డోస్‌ కోవిడ్‌ టీకా వేస్తామన్నారు.  అర్హులైన వారందరు తమ సంబంధింత వలంటీర్లు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్స్‌ను సంప్రదించాలని కోరారు.  

ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌..
 ఉపాధ్యాయులందరూ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేసుకునేలా సోమవారం జిల్లాలోని అన్ని సచివాలయాల్లో ‘మెగా వ్యాక్సినేషన్‌ మేళా’ నిర్వహిస్తున్నట్లు డీఈవో తాహెరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 16న పాఠశాలలు తెరిచేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆమె ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ పరిధిలో గల అన్ని యాజమాన్యాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. ఈ నెల 27 నాటికి నూరుశాతం వ్యాక్సినేషన్‌ కావాలని సూచించారు.   

విజయవాడలో 22,000 డోస్‌లు..
 నగర పరిధిలో గల అన్ని శాశ్వత వ్యాక్సినేషన్‌ కేంద్రాలలో సోమవారం మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు కమిషనర్‌ వెంకటేష్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 22,000 కోవిషీల్డ్‌ డోస్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. టీకా కోసం వచ్చేవారందరూ మాస్క్‌ వినియోగం, భౌతిక దూరం పాటించాలని కోరారు.
 

మరిన్ని వార్తలు