బాధితులను పరామర్శించిన ఆళ్ల నాని

12 Dec, 2020 15:16 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి:  ఏలూరులో అస్వస్థతకు గురై.. చికిత్స అనంతరం కొలుకున్న బాధితులను డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం పరామర్శించారు. ఏలూరు టూటౌన్‌, తంగెళ్లమూడి ప్రాంతాల్లో బాధితుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు భయాందోళన చెందనవసర‌ం లేదని తెలిపారు. ఈ ఘటనకు కారణాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. (చదవండి: ఏదీ తేలిగ్గా తీసుకోవద్దు)

ప్రభుత్వాసుపత్రిలో శనివారం ఉదయం నుండి రెండు అస్వస్థత కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 614 కేసులు నమోదయ్యాయి. 576 మంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్‌ చేశారు. 35 మందిని మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి: టీడీపీ సెల్ఫ్‌గోల్‌: చీప్‌ ట్రిక్స్‌తో పోరాటం)

మరిన్ని వార్తలు