సమస్యల్లేని గ్రామాలే లక్ష్యం 

5 Jul, 2022 19:28 IST|Sakshi

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

మనుబోలు(పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా): సమస్యలు లేని గ్రామాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని వీరంపల్లి పంచాయతీ కొండుపాళెం, లింగారెడ్డిపల్లి గ్రామాల్లో సోమవారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఆయన పర్యటించి గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయో ప్రజాప్రతినిధులు, స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్య కర్తలు ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 

గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళితే వివిధ సమస్యలపై కుప్పులు తెప్పలుగా అర్జీలు అందేవన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో పర్యటిస్తుంటే సంక్షేమ పథకాలు, మౌలిక వసతులపై ప్రజలు ఎటువంటి ఫిర్యాదులు చేయడం లేదన్నారు.  రాబోయే రోజుల్లో మరింత పకడ్బందీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపా రు. ఎంపీపీ వజ్రమ్మ, నాయకులు చిట్టమూరు నరసారెడ్డి, నారపరెడ్డి కిరణ్‌రెడ్డి, జట్టి సురేందర్‌రెడ్డి, బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చిట్టమూరు అజయ్‌రెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి,  గుమ్మడి వెంకటసుబ్బయ్య, మారంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, మోటుపల్లి వెంకటేశ్వర్లు, దాసరి భాస్కర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు