నాగబాబుకు మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్‌ కౌంటర్‌

7 Jan, 2023 18:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: సినీ నటుడు నాగబాబుకు మంత్రి ఆర్కే రోజా కౌంటర్‌ ఇచ్చారు. ఏదైనా విమర్శ చేసేటపుడు విషయం ఉంటే చేయాలే తప్ప నోటి కి ఎంత వస్తే అంత ఫేక్‌ వార్తలతో దుష్ప్రచారం చేయడం సబబుకాదని హితవు పలికారు. టూరిజంలో ఆంధ్రప్రదేశ్‌.. దేశంలో మూడో స్థానంలో ఉందని.. నాగబాబు అదికూడా తెలియకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి ఆర్కే రోజా అన్నారు.

పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి ఏపీకి ఏం చేశారని రాజకీయంగా తాను ఏనాడు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు, ఆయన దూరంగా ఉన్నారు కాబట్టి ఆ విషయం మాట్లాడనని తెలిపారు. వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని.. పార్టీ పరంగా, సిద్ధాంత పరంగానే తన వ్యాఖ్యలుంటాయని స్పష్టం చేశారు. మహిళలను గౌరవించడం ఎలాగో ముందు నాగబాబు తెలుసుకోవాలని మంత్రి రోజా చురకలంటించారు. 

చదవండి: (బాలయ్య బాబు కాదు.. బాలయ్య తాత.. 60 ఏళ్ల దాటాయి ఎవరొస్తారు చూడటానికి..?)

మరిన్ని వార్తలు