రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

3 May, 2022 09:34 IST|Sakshi

కళ్యాణదుర్గం/ అనంతపురం శ్రీకంఠం సర్కిల్‌: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్‌ ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, సేవాభావం, సోదర భావంతో మెలగాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా జీవించేలా అల్లా ఆశీర్వదించాలని ప్రార్థించారు. ముస్లింల జీవితాల్లో రంజాన్‌ పండుగ వెలుగులు నింపాలని కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప, జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీం అహ్మద్‌ ఆకాంక్షించారు.   

మరిన్ని వార్తలు