‘ఆ భూములను చంద్రబాబు పప్పుబెల్లాల్లా పంచాడు’

15 Jun, 2021 14:20 IST|Sakshi

దేవాదాయ భూములను సంరక్షించడమే మా ప్రభుత్వ ధ్యేయం

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

సాక్షి, విజయనగరం: మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో జడ్జిమెంట్‌ పరిశీలించిన తర్వాత స్పందిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. పదవులు ముఖ్యం కాదు, అభివృద్ధి కూడా చూడాలన్నారు. ట్రస్ట్‌ విషయంలో ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదని.. హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని మంత్రి చెప్పారు.

అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. ఆక్రమణలపై ప్రభుత్వ చర్యలతో అందరికీ భయం పట్టుకుందన్నారు. దేవాదాయ భూములను చంద్రబాబు పప్పుబెల్లాల్లా పంచారని ధ్వజమెత్తారు. దేవాదాయ భూములను సంరక్షించడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

చదవండి: వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర అమలు: సీఎం జగన్
‘ఇమేజ్‌ పెంచుకోవడానికి అడ్డదారులుండవు బాబు’

మరిన్ని వార్తలు